Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
తల్లిపాలతోనే రోగనిరోధక శక్తి లభిస్తుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు తల్లిపాలే తాగించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది సూచించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మరికల్, అచ్చం పేట, కొత్తకోట మండలాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బుధవారం బాలమృతం, పౌష్టికాహారం అందజేశారు.
నవతెలంగాణ - మరికల్
మండల కేంద్రంలోని సడక్ పంపు అంగన్ వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సువర్ణ, వార్డు సభ్యులు నాగరాజులు దాదాపు 25 మందికి పౌష్టికాహా రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు చంద్రకళ, ఏఎన్ఎం, ఆశాలు, వార్డు సభ్యులు కమల్, రామకష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట రూరల్ : పట్టణంలోని వినాయక నగర్ కాలనీ లో ఎఎన్ఎం మంగ, అంగన్వాడీ కార్యకర్త రమాదేవి ఇంటింటికెళ్లి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
కొత్తకోట : పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలోని మూడో అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లి పాల వారోత్స వాల కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త విక్టోరియా, వీఓ నర్సింహ రాజులు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగా హన కల్పించారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్త కాంచన, విశ్రాంత ఉపాధ్యాయుడు నర్సింహ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.