Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీఎంకు సమ్మె నోటీస్
కొత్తకోట : వీవోఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం కొత్తకోటలో మూడు రోజులు పాటు వీవోఏలు విధులను బహిష్కరించి టోకెన్ సమ్మె నోటీస్ను ఏపీఎం శ్రీనివాసులుకు గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వీవోఏల సంఘం అధ్యక్షుడు నర్సింహ మాట్లాడుతూ వీవోఏ ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు ఆన్లైన్ పనులు అప్పగిస్తూ పని భారం పెంచు తున్నా .. పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ంటి పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీవోఏలు ఏకమై పారిశ్రామిక విధానాల చట్టం 1947 సెక్షన్22 సబ్ సెక్షన్1 అనుసరిస్తూ మూడు రోజుల పాటు టోకెన్ సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. వీవోఏ సెర్ప్ ఉద్యోగులను గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కనీసం వేతనం రూ.26వేలు ఇవ్వాలని, 10వేల లోపు సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. సెర్పు నుంచి ఐడీ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతినెల వీవోఏల ఖాతాలో నేరుగా వేతనాలు జమ జేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన వీవోఏలను సీసీలుగా గుర్తించా ల న్నారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామనిహెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో వీవోఏల సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి శ్రీలత, సహాయ కార్యదర్శి అరుణ, శైలజ తదితరులు పాల్గొన్నారు.