Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెబ్బేరు : పిడుగు పాటుకు మహిళా గొర్రెల కాపరి లక్ష్మి (45 ) మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై జగదీశ్ రెడ్డి అందించిన వివరాల ప్రకా రం.. వాతావరణంలో మార్పులు చోటు చేసుకో వడంతో మెరుపులతో వచ్చిన వర్షంతో వనపర్తి జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన వంగూరు లక్ష్మి భర్త వంగూరు బాలయ్య కొడుకు సందీప్‌తో కలిసి గొర్రెల మేపుకోవడానికి పెంచికలపాడు గ్రామ శివారుకు వచ్చారు. మధ్యాహ్న మూడు నాలుగు గం టల ప్రాంతంలో పిడుగు పాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో సమీపంలో ఉన్న భర్త బాలయ్య కొడుకు సందీప్ కూడా అక్కడే ఉన్నారు. ఉరుములు మెరుపులతో ఒకసారిగా చూస్తుండగానే పిడుగు పాటుకు గురై అక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. వంగూరు లక్ష్మి కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.