Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెబ్బేరు : భారతదేశంలో సమానత్వాన్ని పెంపొందించి తన రాజ్యపాలనలో కులాలు, మతాలకు అతీతంగా అధికారాన్ని, సంపదని సమానంగా పంచి బహు జన రాజ్యం అంటే ఏ విధంగా ఉండాలో చాటి చెప్పిన మహనీయుడు చత్రపతి శివాజీ మహారాజు అని బీఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ సత్యం సాగర్ అన్నారు.ఆదివారం శివాజీ జయంతిని పురస్కరించుకొని బహుజన సమాజ్ పార్టీ పెబ్బేరు మండల శాఖ ఆధ్వర్యంలో సుభాష్ చౌక్‌లో ఘన ంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా కో ఆర్డినేటర్ సత్యం సాగర్, జిల్లా ఇన్చార్జి గణపురం కృష్ణ మాట్లాడుతూ చత్రపతి శివాజీ చరిత్రను వక్రీకరించి ఆయనను ఒక మతానికి పరిమితం చేసి మిగతా మతాలకు వ్యతిరేకంగా పరిచయం చేసే కుట్రలను తిప్పి కొట్టాలని నిజమైన బహుజన రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ అని గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి చాటి చెప్పాల్సిన అవ సరం ఎంతైనా ఉందని ఆ బాధ్యతను బీఎస్పీ కార్యకర్తలు గ్రామస్థాయిలో చరిత్ర ను చెప్పాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో బీఎస్పీ మండల కన్వీనర్ గుడిసె రాంబాబు, మహిళా కన్వీనర్ బండారి సుజాత, జిల్లా కార్యద ర్శి బహుజన రమేష్, నాయకులు గంధం అరుణ్ కుమార్, మనోహర్, విజరు, వెంకటయ్య ,ఆనంద్, ఆంజనేయులు, గౌతమ్ , లోకేష్, చరణ్, నచ్చకేత తదితరులు పాల్గొన్నారు.
శివాజీకి ఘన నివాళి..
ఆత్మకూరు : ఆత్మకూరు పట్టణంలోని బీసీ కాలనీలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ గాయత్రి రవికుమార్ హాజరై శివాజీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ శివాజీ స్వతంత్రంగా రాజ్యా లను ఏర్పాటు చేసుకున్న మహౌన్నత వ్యక్తి అని పేర్కొ న్నారు.ఆలయ కమిటీ సభ్యులు మున్సిపాలిటీ పాలక వర్గాన్ని సన్మానించారు.అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్ర మంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ విజరు భాస్కర్‌రెడ్డి , మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు రియాజ్ అలీ, మాజీ వార్డ్ మెంబర్ గడ్డమీది శ్రీనివాసులు, భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు రవికుమార్ యా దవ్ తదితరులు పాల్గొన్నారు.
శోభయాత్ర ..
ఆత్మకూరు పట్టణంలోని బీసీ కాలనీలోని ఆరో వార్డు లో జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ ఉత్సవంగా ప్రారంభమైన శోభయాత్ర వైభవంగా నిర్వహించారు. బీసీ కాలనీ నుంచి గాంధీ చౌ రస్తా వరకు శోభయాత్ర నిర్వహించారు.అలాగే మండ లంలోని రేచింతలలో పురవీధుల గుండా యువజన సంఘ వాహిని ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనం తరం బస్సు చౌక్ దగ్గర శివాజీ పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్ర మానికి పట్టణ ప్రము ఖులు చైర్మన్ గాయత్రి రవికుమార్ ,వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి ,బీఆర్ఎస్ నాయకులు రవికుమార్ యాదవ్, వార్డ్ మెంబర్ గడ్డమీద శ్రీనివాసులు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్రవాహన ర్యాలీ..
పెద్దమందడి : మండల కేంద్రంతో పాటు మద్దిగట్ల గ్రామంలో శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగాశివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివాజీ మహారాజ్‌కు జేజేలు పలికారు. అనం తరం గ్రామస్తులు, యువకులు, ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో యువత మంచి మార్గంలో నడుస్తూ, ఆదర్శ ప్రాయంగా, సత్ప్రవర్తనతో మార్గదర్శకంగా మెలగాలని సూచించారు.