Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్ నగర్
పట్టణంలోని సమస్యల పరిష్కారాని కృషిచేస్తానని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని అన్ని వార్డులలో సమస్యల పరిష్కారం కోసం పాలకొండ నుంచి మంత్రి వాడు పర్యట నలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.. అనంతరం పాలకొండ, ప్రేమ్ నగర్‌కా లనీల్లో ఆయన విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. వీధుల వెంట వృద్దులు, యువత, మహిళలతో మాట్లాడుతూ మంత్రి ముందుకు కదిలారు. ఆసరా పింఛన్ లబ్ధిదారులు మంత్రిని కలిసి తమ సంతో షాన్ని వ్యక్తం చేశారు. ఎక్కడకక్కడ ప్రజల నుంచి స్థానిక సమస్యలను తెలుసుకు న్నారు. హైదరాబాద్ మణికొండ స్థాయిలో పాలకొండ అభివృద్ధి చెందిందని, గతంలో ఏమాత్రం డిమాండ్ లేని భూములు ఇప్పుడు కోట్లాది రూపాయల విలువ చేస్తున్నాయని తెలిపారు. పాలకొండలో ఒక్క ఇంటిని కూల్చకుండా రోడ్డు విస్తరణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మినీట్యాంక్ బండ్ విశాలమైన రోడ్లు, మంచి నీటి సౌకర్యం డ్రైనేజీ వ్యవస్థ, వీధి వ్యాపారులకు షాపులు, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హైదరా బాద్ స్థాయిలో అభివృద్ధి చేయడంతో స్థానికులే కాకుండా పొరుగు జిల్లా ప్రజలు పట్టణంలో నివసించేందుకు ఆసక్తి చూపేస్థాయి ఎదిగామని తెలిపారు. కేవలం ఎన్నికల అప్పుడు కులం, మతం పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు దం డుకు న్నారని ప్రయత్నం చేసే కొందరు నాయకులు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే కుట్రలు చేస్తారని... ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ఏమాత్రం పట్టించుకోని నాయకులు నీచపు రాజకీయాలకు పాల్పడుతుంటారని ఆయన పేర్కొన్నారు. ప్రేమ్‌నగర్‌కు చెందిన మోబిన్ అనే యువకుడు అనారోగ్యంతో తీవ్ర అపస్మారక స్థితిలోకి వెళ్తే పేదరికం కారణంగా తాము ఏమి చేయలేమని యువకుడి తల్లిదండ్రులు సైతం వదిలేసి వెళ్లారని.. సమాచారం తెలిసిన తను వెంటనే అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తరలించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొన ఊపిరితో ఉన్న యువకుడి ప్రాణాలు కాపాడమని మంత్రి గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు వైద్యపరంగా ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా... 24 గంటలు అందుబాటులో ఉండి సేవచేస్తానని మంత్రి తెలిపారు. ఈ కా ర్యక్రమంలో మున్సి పల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజివెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, కౌన్సిలర్లు నరేందర్, కిషోర్ కుమార్, బాలీశ్వరి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులు, వెంకట రాములు, పాషా పాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, జగపతిరావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.