Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ - వనపర్తి
కేంద్రప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మోడీ ప్రభుత్వం ఆపాలని జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజ నేయులు డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యాల యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్మిక కర్షక సంఘర్ష ర్యాలీ జయప్రదం చేయాలని వనపర్తి మండల సదస్సు గోపాలకృష్ణ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా కార్యదర్శి , తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేశ్వర చారి పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలన్నారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. రైతులకు పంటకు మద్దతు ధర పెట్టుబడి ఖర్చులు పోను 50 శాతం అదనంగా స్వామి నాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఇస్తామని హామీ ఇచ్చిన మోడీ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు రోజు కూలి రూ.600 ఇవ్వాలని , 200వందల రోజుల పాటు పని కల్పించాలని అన్నారు. మున్సిపల్ , పట్టణాలకు ఉపాధి హామీని విస్తరించాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్య పరిష్కారం చేయాలన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్నారు.ఇంటి స్థలం లేని వారికి స్థ లం ఇచ్చి ఇండ్లు నిర్మాణానికి ఐదు లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలను తగ్గించాలన్నారు. సంపన్నులపై సంపద పన్ను వేసి పేదలపై పన్ను ఎత్తివే యాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నందిమల్ల రాములు, ఏ.కృష్ణయ్య. జ్యోతి. తదితరులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం
పెబ్బేరు : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ .. కార్మిక చట్టాలను కేంద్రప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘాల ఆధ్వర్యంలో శ్రీరంగాపూర్ మండల సదస్సు శాంత బాయి అధ్యక్షతన జరిగింది.ఈ సదస్సులో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం ఆంజనే యులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు , తెలం గాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు డీ.బాల్ రెడ్డి హాజరై మాట్లాడారు.బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగసంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యో గులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిందని విమర్శించారు. అసంఘటిత. ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ బేసిక్ మీద పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, తదితర సమస్యలపైఅనేక దఫాలుగా ఆందోళ నలు, పోరాటాలు చేసిన కేంద్రప్రభుత్వం నిమ్మకు నేరెత్తిన ట్లుగా వ్యవహరిస్తుందని ఎద్దేవాచేశారు. దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన విధంగా గుణపాఠం చెప్పేందుకు మార్చి 18 నుంచి మండలంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్ర మాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 5న చేప ట్టనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయ కులు లక్ష్మన్న , ఆశా వర్కర్ల మండల అధ్యక్షుడు కల్పన, శ్రీల త, పుష్ప అంగన్వాడీ యూనియన్ నాయకులు మంజుల, కవిత, గ్రామపంచాయతీ యూని యన్ నాయకులు పుల్లన్న , రామస్వామి, ఎల్లయ్య , రాము డు, విరాట్ పాల్గొన్నారు.