Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నంబావి : మండలంలోని పెద్దదగడ గ్రామం పంచాయతీ రికార్డుల తనిఖీ నిమిత్తం ఆర్టీఐ చట్టం ప్రకారం తనిఖీ కోరగా.. సంబంధిత పంచాయతీ రాజ్ అభివృద్ధి అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి గురు వారం తనిఖీకి అధికారులు సమ్మతించారు. రికార్డుల తనిఖీ నిమిత్తం ఆర్టీఐ కార్యకర్తలు పంచాయతీ కార్యాలయానికి చేరుకోగా పంచాయతీ అధికారులు గైర్హాజరై తనిఖీలకు రికార్డులు అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం, పెద్దదగడ గ్రామపంచాయతీ కార్యదర్శి పిలుపు మేరకు రికార్డుల తనిఖీలకు హాజరైన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ సభ్యులకు ఊహించని విధంగా స్థానిక ధికారులు గైర్హాజర్ కావడం విశేషం. ఆర్టీఐ ప్రచార కార్యక్రమంలో భాగంగా సీసీిఆర్ సంస్థ వివిధ గ్రామాలలో రికార్డు తనిఖీలను చేపట్టి ప్రజలకు చట్టంపై అవగాహన చేపడ్తూ..గ్రామాలలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బహిర్గతం చేస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అందులో బాగంగా రికార్డు తనిఖీలకు రమ్మని ఆహ్వానించిన పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై ఎంపీడీవోను వివరణ కోరగా కార్యదర్శి శిక్షణ కోసం హైదరాబాద్కు వెళ్లాడని, మీకుమళ్లీ ఇంకో తేదీని కేటాయించడం జరుగుతుందని, మళ్లీ తిరిగి రావాలని పొంతలేని సమాధానం ఇచ్చారు. తప్పు తేదీలు ఇచ్చిన కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకో వాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాసెక్రెటరీ చారకొండ బాబు, కర్నూలు జిల్లా సెక్రెటరీ గాడి దేవ రాజు, వనపర్తి జిల్లా సెక్రటరీ గొల్లబోయ ఆంజనేయులు ,సీసీఆర్ సంస్థ సభ్యులు యెహౌన్, పుట్టపాగవిష్ణు, బొల్లి రాజు, కుర్మన్న, రామచందర్ యాదవ్, రాఘవాచారి, ప్రసాదు పుట్టపాగ, విక్రమ్,గడ్డం వినోద్ పాల్గొన్నారు.