Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : వనపర్తికి టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ మరకంటించిన ఉపాధ్యాయిని రేణుకను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని ఏఐఎస్ఎఫ్ వనపర్తి డివిజన్ కార్యదర్శి గోకం వంశీ డిమాండ్ చేశారు. గురువారం వనపర్తి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతమెన్నడు రాష్ట్రంలో వనపర్తికి ఇంతటి చెడ్డ పేరు రా లేదన్నారు. ఉపాధ్యాయినిగా బాధ్యతాయుత స్థానంలో ఉండి, పేపర్ లీకేజీ అక్రమాలకు పాల్పడం తగదన్నారు. పేపర్‌ను అభ్యర్థులకు లక్షలకు అమ్ముకోవడమే గాక, వనపర్తిలోనే ఆ ప్రశ్న పత్రం ఆధారంగా పరీక్షలకు అభ్యర్థులను సిద్ధం చేయటం విచిత్రంగా ఉందన్నారు. పరీక్షల్లో పిల్లలు తప్పు చేస్తే దండించవలసిన స్థానంలో ఉండి, ఆమె పేపర్ లీక్ చేయటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు టీచరుగా కొనసాగే అర్హత లేదని అన్నారు. పిల్లలకు విలువలు ఎలా నేర్పుతారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన, విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటివి పునరావతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి విజయ్, నాయకులు ప్రసాద్, భానుసాగర్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.