Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆత్మకూరు : తమకు ఎస్సీ ధ్రువపత్రాలు జారీ చేయాలని మాదాసి కురువ సంఘం ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలోని తాహసీల్దార్ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాదాసి కురువ(షెడ్యూల్ కులం) మా పూర్వీకులు మా కుల వృత్తి అయిన గొర్రెల కాపరులుగా ఎక్కువ కాలం అడవిలో ఊరికి దూరంగా, సమాజానికి చదువుకు దూరంగా సంచార జీవితం గడుపు తున్నట్లు వివరి ంచారు. మాదాసి కురుమకు బదు లుగా కురువ అనే పేరుతో పిలుస్తారని పేర్కొన్నారు.గతంలో తమ పూర్వీకుల నిరక్ష్యరాస్యత కారణంగా అధికారుల అలసత్వంతో తమ కులానికి కురువ బీసీ బీ, బి11 అని తప్పుడు ద్రువపత్రాలు జారీ చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయాన్ని అధికారులు, ప్రజాప్ర తినిధులకు మొరపెట్టుకున్న ఫలితం లేకపోయిందని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ మెమో నెంబర్ 1268 ఇప్పటికీ అమలు కాకపోవడంతో తమకు మాదాసి కురువ (షెడ్యూల్ కులం) ఇప్పటికే కుల ధ్రువపత్రాలు పొందలేకపోయామని , జాతీయ ఎస్సీ కమిషన్ సిఫార్సు ఆధారంగా జారీ చేసిన మెమో నెంబర్ 1268 ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 204 ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 5, జీ.ఓ.ఎంఎస్ నెంబర్ 2, పరిగాణలోకి తీసుకొని చట్టప్రకారం మాదాసి కురువ (షెడ్యూల్ కులం) తమకు రాజ్యాంగపరమైన హక్కు కుల ధ్రువపత్రం జారీ చేయాలని కోరారు. అంతకుముందు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి డప్పులతో తాహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని కార్యాలయం ముందర ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సం ఘం నాయకులు ఖానాపూర్ తిరుపతయ్య, కురువ మల్లేష్, కానాపురం మల్లేష్, లక్ష్మయ్య, కడుమూరు బాలరాజు, కుమార్ లింగంపల్లి సత్తి, హైదరాబాద్ మల్లేష్, మోట్లంపల్లి శ్రీను ,లింగన్న, శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.