Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త అనిరుద్ రెడ్డి
నవ తెలంగాణ -మిడ్జిల్
కులమాతాలకతీతంగా సోదరభావంతో మెలగాలని కాంగ్రెస్ జడ్చర్ల నియోజకవర్గ సమ న్వయకర్త అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం మం డలంలోని వాడియాలలోని సలోమి చర్చిలో ప్రా ర్థనలు చేశారు. చర్చి అభి వృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి కలిగి ఉండాలని తెలిపారు. అనంతరం సంఘ పెద్దలు శాలువాపూలమాలతో ఘనంగా సన్మా నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్ జాన్, వీరస్వామి మాదిగ, వాడి యాల మాజీ సర్పంచ్ వెంకటేష్‌గౌడ్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సంపత్‌కుమార్, బీర్ల మల్లయ్య, బీరయ్య, రమేష్, బంగారు, బొర్రా రవికుమార్, సంఘ పెద్దలు వెం కటయ్య, పరిమళ రాజు, రత్నమయ్య, నితిన్, లలితమ్మ, రుతమ్మ, వజ్రమ్మ, అనిత, సుక్కమ్మ, మరియమ్మ, జంగమ్మ తదితరులు పాల్గొన్నారు.