Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండీడ్
మండల కేంద్రంలో ఆదివారం ఛత్రపతి శివాజీ జయంతిని అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ రాజకీయ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భరతమాత ముద్దుబిడ్డ, హిందూ ధర్మానికి వన్నెతెచ్చిన వీరుడని, ధైర్యానికి, దేశభక్తికి, ధీరత్వానికి మారి పేరు శివాజీ మహారాజ్ అని వారు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఎసీఎస్ వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, సర్పంచ్ చంద్రకళ నరేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు కేవీ రాములు, ఎంపీటీసీ బాలయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, రామచంద్రారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు ప్రభునాయక్, జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బోరు కృష్ణ, గుండాల చెన్నప్ప, జంగల్ల వెంకటయ్య, పసుల శీను, భీమయ్య పాల్గొన్నారు.
మిడ్జిల్: న్యాయం కోసం, ధర్మంకోసం, నిరంతరం పనిచేసిన నాయకుడు ఛత్రపతి శివాజీ అని టీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాడియాలలో ఆయన శివాజీ చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధులగుండా తిరుగుతూ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాదయ్య, శ్రీనివాసులు,శంకర్, బొర్రా రవికుమార్, లక్ష్మణ్, రాము, ప్రమోదు, రమేష్, కళ్యాణ్, ఉదయ్‌కుమార్, వినోద్, సురేష్, వంశీ, మల్లేష్ పాల్గొన్నారు.
రాజాపూర్ : మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన వీరుడు ఛత్రపతి శివాజీ అని డీసీఎంఎస్ చైర్మన్ పట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీలరమేష్నాయక్ పేర్కొన్నారు. శివాజీ జయంతి సందర్భంగా ఆదివారం మండలంలోని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బచ్చిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, మండల కో- అల్తాఫ్ బేగ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శినరహరి, జగన్నాయక్, వనపర్తి సత్తయ్య, అచ్చయ్య, నారాయణరెడ్డి, కిషన్ జి, బాలరాజ్, వెంకట్రావు, బాబులాల్, రాజేష్, బాలాజీ, లక్ష్మణ్, నరేందర్, రాజు, అరుణ్ పాల్గొన్నారు. రాజపురం మండలంలో తిరుమలాపూర్లో ఆదివారం ఛత్రపతి శివాజీ జయం తిని ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, స్థానిక సర్పంచ్మహేశ్వరి, మహిపాల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రజినిజగన్నాయక్, మాజీ సర్పంచ్ రామకృష్ణగౌడ్ గ్రామస్తులు పాల్గొన్నారు.