Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాన్‌గల్ : మండలంలోని మాధవరావుపల్లి గ్రామంలో ఈఎంజేఆర్ 6 డీ-8 కాలువలో భూములు కోల్పోయిన రైతులు దాదాపు 135 మంది రైతులు ఉన్నారు. ఇందులో గత ఆరు సంవత్సరాల కిందట కాల్వ తవ్వి భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంపై గతంలో పాలిం చిన నాయకులు కాల్వను అసంపూర్తిగా తవ్వి రైతులకు నష్టపరిహారం ఇప్పించ లేదు. కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి బీ సుబ్బయ్య యాదవ్ ఎంపీటీసీల ఫోరం వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కాల్వలో 80 ఎకరాలు భూములు , 265 మామిడి చెట్లు డీ-8 కాలువలో భూములు కోల్పోయారు. రైతులందరికీ నష్టపరిహారం ఇప్పించా లని వీ సుబ్బయ్యయాదవ్ ఎమ్మెల్యేను కోరడంతో ఎమ్మెల్యే ఆదేశం మేరకు..గురువారం జిల్లా సర్వేర్లు మాధవరావు పల్లి గ్రామానికి చేరుకు న్నారు. ఇందు లో సర్వేర్లు అబ్దుల్ అహ్మద్, మైనుద్దీన్ భూపరిపాలన శాఖ ప్రత్యేక తాహసీ ల్దార్ మల్లికార్జున్, కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ రాజ శేఖర్ ఇరిగేషన్ ఏఈ వెంకటేష్ యాదవ్, మాధవరావు పల్లి గ్రామ సర్పంచ్ సునీత రామ్ చందర్, గ్రామ బీఆర్ ఎస్ అధ్యక్షుడు రోడ్డ కృష్ణ , టీఆర్ఎస్ నాయకులు శేఖర్ ,గురువయ్య ,వెంకటయ్య, సురేందర్ రెడ్డి, నరసింహ ,కురుమయ్య, మద్దిలేటి, ప్రతాప్ రెడ్డి, రామ్ చందర్‌లు పాల్గొన్నారు.