Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడపదాటని తెల్లబంగారం
- పత్తికి లభించని మద్దతు ధర
- పెట్టుబడి రాక రైతుల విలవిల
- రూ.12 వేలకు పెంచాలని డిమాండ్
నవ తెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఒకవైపు వర్షాలు అధికమై దిగుబడి తగ్గింది. రెండు నెలలుగా నిరవధిక వర్షాలు రావడంతో పంట పొలాలు నీరు చిచ్చులేసిపోయాయి. దీంతో 20 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన ఎకర పొలంలో రెండు, మూడు క్వింటాళ్లకు పడిపోయింది. పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గడంతో రైతన్న పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయాడు. కనీస మద్దతు ధర లేకపోవడంతో పండించిన పంట రైతన్న కడప దాటడం లేదని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెల్లబంగారం పండించిన రైతులకు కష్టాలు తప్పడంలేదు. మద్దతు ధర లభించక దళారులు నిర్ణయించిన ధరకే పత్తిని అమ్ముకుంటున్నారు.
ఇళ్లలోనే పత్తి నిల్వలు..
పంటను తక్కువ ధరకు అమ్ముకోలేక కొందరు ఇళ్లలోనే పత్తిని దాచు కుంటున్నారు. రెండు, మూడు నెలలుగా పత్తి నిల్వ ఉంచడంతో తేమ తగ్గి తూ కం తక్కువ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మద్దతు ధర లభించక దళా రులు నిర్ణయించిన ధరకే పత్తిని అమ్ముకునే పరిస్థితి దాపురించిందని తెలకపల్లి, బిజినెపల్లి మండల రైతులు వాపోతున్నారు. ఎకరం రూ.40 వేల పెట్టుబడితో పత్తి సాగు చేస్తే పెట్టుబడిలో సగం ధర అయినా రావడం లేదని రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. పంటకు తెగుళ్లు సోకి కొంత నష్టపోగా.. ధర పూర్తిగా తగ్గడంతో మరింత నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పడిపోయిన ధర
పత్తి సీజన్ ఆరంభంలో క్వింటాల్ పత్తి రూ. 10వేల నుంచి రూ. 12 వేల ధర పలికింది. పత్తి ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో దళారులు కొను గోలు చేయడం నిలిపివేశారు. పత్తికి డిమాండ్ లేదంటూ ధరను తగ్గించడం మొదలు పెట్టారు. ముందుగా రూ. 12వేల ఉన్న పత్తిధర రూ.10వేలకు తగ్గిం చారు. తర్వాత రూ. 9వేలు, రూ.8వేలు, చివరికి రూ. 7వేల వరకు తగ్గించారు. ప్రారంభంలో ఉన్న ధర కంటే మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న ఆశతో చాలామంది రైతులు పత్తిని విక్రయించలేదు. ధరలు పడిపోయే అవకాశం ఉం దన్న విషయాన్ని గ్రహించిన రైతులు పెద్ద మొత్తంలో విక్రయాలకు సిద్ధమ య్యారు. పరిస్థితిని గమనించిన దళారులు కొనుగోళ్లను క్రమ క్రమంగా తగ్గిం చారు. దీంతో ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు పత్తి ధర రూ. 7వేల నుంచి రూ. 7500లకు కొనుగోలు చేస్తుండటంతో రైతుల బాధ వర్ణణాతీతం.
మద్దతు ధర కల్పించాలి
ధరలు పడిపోవడంతో రైతులు ఇళ్లలోనే పత్తిని నిల్వ చేస్తున్నారు. ధర పెరిగినప్పుడు విక్రయించాలని తెలకపల్లి, బిజినెపల్లి, తాడూరు, గద్వాల, గోపాల్పేట మండల రైతులు నిర్ణయించుకున్నారు. పంటకోసం చేసిన అప్పులను తిరిగి మరోచోట అప్పులు చేసి తీరుస్తున్నారు. పత్తికి సరైన మద్దతు ధర నిర్ణయిస్తే తప్ప తమ కష్టాలు తీరవని రైతులు పేర్కొంటున్నారు.
చేసిన అప్పు తీరే దారి లేదు..
మూడు ఎకరాల్లో పత్తి సాగుచేశా. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. ఈ సారి పత్తికి ప్రా రంభంలో మంచి ధరపలికింది. రోజురోజుకూ డి మాండ్ పెరుగుతుండటంతో దళారులు ధరలను ని యంత్రించారు. ధర పెరుగుదల కోసం ఎదురు చూ స్తు న్నాం. గతేడాది కంటే ఈసారి పంటను పెద్దమొత్తంలో సా గుచేయడంతో పెట్టుబడులు భారీగా పెరిగాయి. మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం. మూడు ఎకరాల సాగుకు రూ.90000 అప్పు చేసి పెట్టుబడి పెట్టా. అప్పు తీర్చే దారి లేక పంట పొలాలు అమ్ముకునే దుస్థితి నెలకొంది.
- భగవంతు రావు, రైతు, రాయిపాకుల, తెలకపల్లి మండలం, నాగర్ కర్నూల్ జిల్లా
గిట్టుబాటు ధర కల్పించకపోతే ఉద్యమిస్తాం
పత్తి ధర తగ్గడంతో రైతులు కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఈసారి ఎకరాకు మూడు క్వింటాల్‌కు మించి దిగుబడి రాలే దు. రాష్ట్ర ప్రభుత్వం పత్తికి 12 వేలకు మిం చి ఖరారు చేయాల్సి ఉంది. ప్రారంభంలో సీసీఐ ద్వారా క్వింటాల్ ధర 7వేలకే కొను గోలు చేశారు. దిగుబడి తగ్గింది. ధరలు పెంచక పోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. దీంతో ఇంకా 50శాతం మంది రైతులు ఇంట్లోనే పత్తినిల్వలు ఉంచు కున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పత్తి ధరలు పెంచి రైతులను ఆదుకోవాలి.
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు,నాగర్ కర్నూల్జిల్లా