Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉండవల్లి : అర్ధరాత్రి జాగరణ చేసి తిరిగి వచ్చే ప్రయాణంలో రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. అందరూ 16ఏళ్లలోపు న్న యువకులే. శివరాత్రి జాగరణ ఉత్సవాలను ముగించుకొని వస్తుండగా ఎదురుగా బొలేర వాహనం వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢకొీనడంతో వాహనంపై ఉన్న ముగ్గురు యువకులు చెందారు. విషయం తెలుసుకున్న ఎస్సై బాలరాజు అక్కడికి చేరుకొని సంఘటన వివరాలపై ఆరాతీశారు. వివరాల్లోకి వెళితే. మానపాడు మండలం పరిధిలోని కొరిపాడులోని సాయిగౌడ్ , రఫీ , శేఖర్లు ద్విచక్రవాహనంపై శివరాత్రిఉత్సవాల్లో భాగంగా అల్లంపూర్ పుణ్యక్షేత్రానికి దర్శనం కోసంవెళ్లారు. ఉపవాసాలతో వెళ్లి రాత్రి వరకు అక్కడనే వేచి ఉండి. అర్ధ రాత్రి వేళ తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అలంపూర్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాధిత కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే అబ్రహం
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటానని స్థానిక ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. ఆదివారం అలంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షించి పోస్టుమార్టం రిపోర్టు తొందర అందజేయాలని వైద్యులకు సూచించారు. మృతి చెందిన కుటుంబాలు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.శివరాత్రి సందర్భంగా ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అనంతరం పోస్టుమార్టం నిర్వహించి శవాలను బంధువులకు అప్పగించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని అంతక్రియలు పూర్తి చేశారు.