Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర యువజన విభాగం చీఫ్ కోఆర్డినేటర్
వనపర్తి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి రాష్ట్రంలోని వైఎస్సార్సీపీ యువజన విభాగం కృషి చేయాలని వైఎస్సార్ తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ గడ్డం హిందూజారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరా బాదులోని లోటస్ పాండు లోని రాష్ట్ర కార్యాలయంలో వైఎస్సార్ తెలం గాణ పార్టీ రాష్ట్ర యువజన విభాగం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వనపర్తి జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పార్టీ అధినేత్రి వై.ఎస్ షర్మిల ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగ్రామీణ, మండలం, పట్టణాలలో బలోపేతానికి పనిచే యాలని పిలుపునిచ్చారు.సమావేశంలో 33 జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు.