Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు
నవ తెలంగాణ- కందనూలు
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల్లో పనిచేస్తున్న ఐకేపీ వీవోఏలకు కనీస వేతనం రూ. 26 ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు టోకెన్ సమ్మె ని ర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్లో నిర్వహించిన ధర్నా సందర్భం గా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఐకేపీ ఉద్యోగుల సంఘం సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మార్చి 16, 17, 18 తేదీల్లో టోకెన్ సమ్మెకు పిలుపు ఇచ్చారని తెలిపారు. మొదటి రోజు టెంట్ వేసుకొని సమ్మె శిబిరం ప్రారంభించామన్నారు. ఆయన ప్రసంగిస్తూ ఐకెపీ, వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు రూ.26వేలు అమలుపరచాలని, ఐడీ కార్డులు గుర్తింపు కార్డులు, డ్రస్సులు ఇవ్వాలని ఆన్లైన్ పద్ధతిని ఉపసంహ రించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయక పోవ డంతో సరైన ఆహారం లేక పోషకాహార లోపంతో బాధలు పడుతున్నారని, విద్యా, వైద్యం పెరిగిన ధరల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలిపా రు. ప్రభుత్వం గతంలో రూ. 10వేలు ఇస్తామని ప్రభుత్వం మోసం చేసిం దని, కేవలం రూ. 3900 వేతనం ఇస్తూ శ్రమ దోపిడీకి పాల్ప డుతుం దని, ఆన్లైన్ పనితో తీవ్రమానసిక ఇబ్బందులకు గురై వీవోఏలు ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారని, తక్షణమే జీతాలు పెంచి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూ పించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెేపీ, వీవోఎలా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజకుమార్, జిల్లా అధ్యక్షురాలు సుమలత, జిల్లా ఉపాధ్యక్షురాలు సు మతి, నరసింహ, దేవయ్యగౌడ్, కురుమయ్య, రామస్వామి, సుశీల, చెన్నమ్మ, మాధవి, వసంత, బద్రి తదితరులు పాల్గొన్నారు.