Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్నగర్
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం ఆమె తన ఛాంబర్లో నిర్వహించిన 4వ స్థాయి సంఘం సమావేశంలో మాట్లాడారు. అప రిశుభ్రమైన ఆహారం అందిస్తే ఊరుకునేదిలేదన్నారు. అధికారులు మధ్యాహ్న భోజన పథకంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఏజెన్సీల కు రావాల్సిన బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. వర్షాలు కురు స్తున నేపథ్యం లో దోమల శాతం పెరిగే ప్రమాదం ఉందని, వాటి నివా రణకు ప్రత్యేక కార్యచరణ చేప ట్టాలన్నారు. గ్రామాల్లో మహిళా సంఘాలను కలుపుకొని ప్రజలకు పెద్ద ఎత్తున అవగా హన కల్పించాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి రోగాల భారిన పడకుండా ముంద స్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సమావేశంలో జెడ్పీటీసీలు, కో- ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.