Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదవరోజు రోడ్లు ఊడ్చి నిరసన
- మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు
- వీఆర్ఏల డిమాండ్లను అమలు చేయాలి:
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.రాములు
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ వీఆర్ఏలు చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం పదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వీఆర్ఏలు చీపుర్లతో రోడ్లు ఊడ్చి నిరసన తెలిపారు. దీక్షా శిబిరాలను వివిధ పార్టీల నాయకులు సందర్శించి సంఘీ భావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నవతెలంగాణ- మిడ్జిల్
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదు ట నిర్వహిస్తున్న వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రాములు సందర్శించి వారికి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ వీఆర్ఏలు న్యాయమైన డిమాండ్ల కోసం పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. సీపీఎం పార్టీ వీఆర్ఏలకు మద్దతు గా ఉంటుందన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు ప్రభు త్వంపై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ముఖ్య మంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీని అమలు చేయా లని లేకుంటే వీఆర్ఏలూ రాబోవు రోజుల ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. తహసీల్దార్ శ్రీనివాసులు వీఆర్ఏలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు ప్రభుత్వము వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని లేకుంటే ప్రజలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు బాలస్వామి, కరు ణాకర్, శ్రీనివాసులు, శివ, మల్లేష్ లక్ష్మి, కలమ ,బాలమ్మ, వెంకటమ్మ, తదితరులు పాల్గొన్నారు
దండయాత్రకు సిద్ధం కావాలి
- సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు
పెద్దకొత్తపల్లి: సీఎం కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటూ వీఆర్ఏలు పది రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని, అందుకే వీఆర్వోలు ముఖ్యమంత్రి పై దండయాత్రకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు పిలుపు నిచ్చారు. మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ చైర్మన్ మల్లేష్ నాయుడు, కో కన్వీనర్ జి.రాములు, జనరల్ సెక్రెటరీ ప్రసన్న, వీఆర్ఏలు బంగారయ్య, సోమే శ్వరి, చెన్నయ్య, రవి ,వెంకటేష్ తదితరు పాల్గొన్నారు.
వీఆర్ఏలు సమ్మె శిబిరాన్ని చీపురుతో ఊడుస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల జేఏసీ చైర్మన్ మల్లేష్ నాయుడు మాట్లాడుతూ సీఎం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసేవరకు సమ్మె ఆపేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ మండల కో కన్వీనర్ రాములు, జనరల్ సెక్రెటరీ ప్రసన్న ,బంగారయ్య, లలిత, చెన్నయ్య, రవి, శివతేజ, వెంకటేష్, సోమేశ్వరి పాల్గొన్నారు.
తిమ్మాజిపేట: వీఆర్ఏలు ఒంటికాలిపై దీక్ష చేపట్టి అనంతరం దీక్ష శిబిరం ఆవరణ చీపుర్లతో ఊడ్చి నిరసన తెలి పారు. వీరికి అంబేద్కర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీని వాస్ బహదూర్ మద్దతు తెలిపి మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా అపరిష్కతంగా ఉన్న వీఆర్ఏ ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో వీఆర్ఏలు నవనీత, కె రాజు, రామచందర్, ఉదరు, కుమార్ నరసింహ, మహేష్, అనంత రాములు, రాఘవాచారి, తదితరులు పాల్గొన్నారు.
బల్మూరు: తహసిల్దార్ కార్యాలయం ఎదుట పది రోజులుగా కొనసాగుతున్న వీఆర్ఏల దీక్షకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకష్ణ మద్దతు తెలిపి మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీ ఖదీర్, వెంకటయ్య, శ్రీనివాసులు, వీఆ ర్ఏల సంఘం నాయకులు జహంగీర్, వెంకటయ్య, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
అచ్చంపేట రూరల్: మండల కేంద్రంలో దీక్ష చేపట్టిన వీఆర్ఏలు చీపుర్లతో రోడ్లుఊడ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ చైర్మన్ పరమేష్, కో చైర్మన్ శోభారాణి, వెంకటయ్య, ప్రధాన కార్య దర్శి సాజిత్ , ప్రచార కార్యదర్శి రాంగోపాల్, శాంతయ్య , కోశాధికారి నిరంజన్, సభ్యులు రాములు, చిట్టయ్య, నిరంజన్, తవిటి ఆంజనేయులు, వెంకటేష్, చాంద్బి, హనుమంతు, మహేష్, బుద్ధుల అంజనేయులు, శ్రీను, కవిత, ఉమా, అనిత, తదితరులు పాల్గొన్నారు.
ఊట్కూర్: తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేేపట్టిన దీక్షలకు మైనార్టీ నాయకుడు హుస్నా బాద్ యాసీన్ సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడుతూ టీఆర్ ఎస్ ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు రాజప్ప, కౌసర్ తిరుపతి మండలంలోని వీఆర్ఏలు తది తరులు పాల్గొన్నారు.
ఆత్మకూర్: వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని వీఆర్ఏల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గోవింద్ సందర్శించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్ర మంలో మండల అధ్యక్షులు గోవిందు, మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు గటన ,నయూం, రాధా, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కందనూలు: వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని సిపిఎం మం డల కార్యదర్శి జి.అశోక్ సందర్శించి సంపూర్ణ మద్దతు తెలి పి మాట్లాడుతూ పది రోజులుగా వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. సీఎం కేసీఆర్ వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. వీఆర్ఏలకు సీపీఎం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీిఎం నాయకులు ఆంజనేయులు, సత్యనారాయణ , మల్లేష్, రమేష్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ: తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో వీఆర్ఏలు చేస్తున్న దీక్షలకు బుధవారం వీఆర్ఏ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు విజరు మద్దతు తెలిపి మాట్లాడుతూ గ్రామ సేవకుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. వీఆర్ఏల దీక్షలకు బిజెపి మండల అధ్యక్షులు విజేందర్రెడ్డి , మాజీ ఎంపిటిసి జంగయ్య యాదవ్ , సీనియర్ నాయకులు వరప్రసాద్ రెడ్డి వేరు వేరుగా మద్దతు తెలిపి మాట్లాడుతూ వీఆర్ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.
పాన్గల్: మండల కేంద్రలో వీఆర్ఏలు చేపట్టిన దీక్ష శిబిరంలో రాష్ట్ర నాయకులు రమేష్, జేఏసీ జిల్లా చైర్మన్ సురేష్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కార్యవర్గ సభ్యు లు తిరుపతయ్య, పాన్గల్ మండల వీఆర్ఏ సంఘం అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వీపనగండ్ల : తాసిల్దార్ కార్యాలయం ముందు కొన సాగుతున్న వీఆర్ఏల సమ్మెకు సీపీఎం మండల కార్యదర్శి బాల్రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడుతూ వీఆర్ఏలు న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఈ కార్య క్రమంలో మధు, విజరు, పరశురాం, రాజు, భాగ్యలక్ష్మి , కుమార్, కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి : జిల్లా కేంద్రంలో వీఆర్ఏలు సమ్మెలో భాగంగా పాత ఆర్డీవో కార్యాలయం ఎదుట రోడ్లను ఊడ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు జి.సురేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ పలు దఫాలుగా పోరాటాలు చేశామన్నారు. ముఖ్య మంత్రి హామీలు ఇచ్చి రెండేళ్లు పూర్తయినా పట్టించుకోకపోవడంతో తాము నిరవధిక సమ్మెకు దిగామన్నారు. తమ కార్యాచరణ ప్రకా రం పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో వనపర్తి జిల్లా కో కన్వీనర్లు లోకనాథ్, కష్ణవేణి, మహేష్, మాసన్న, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షు లు రమేష్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కో కన్వీనర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ: తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు తెలంగాణ రైతు సం ఘం మండల అధ్యక్షుడు ఏ.లక్ష్మయ్య మద్దతు తెలిపి మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వీఆర్ఏలు పాల్గొన్నారు.