Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమెస్పీ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి టైగర్ జంగయ్య
నవతెలంగాణ- కందనూలు
ఎస్సీ వర్గీకరణపై బీజేపీ మోసం చేస్తే తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మెస్పీ ఉమ్మడి జిల్లా ఇంచార్జి టైగర్ జంగయ్య హెచ్చరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ఎమ్మార్పిఎస్ జిల్లా కన్వీనర్ సౌట కాశీం ఆధ్వర్యంలో ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలంటూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిన బీజేపీ మాదిగలను మోసం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మా ర్పియిస్ రాష్ట్ర నాయకులు గుట విజరు, ఎమ్మార్పియిస్ జిల్లా కన్వీనర్ సౌట కాశీ%శీ%, ఎమ్మార్పియిస్ జిల్లా కార్యదర్శి రామ్ ప్రసాద్, ఎమ్మార్పియిస్ జిల్లా నాయకులు రాముడు, కొయ్యల వెంకటేష్, జగదీశ్, ఎంఎస్ఎఫ్ నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.