Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు
నవతెలంగాణ-అమరచింత
ముఖ్యమంత్రి కెసిఆర్ హామీలతో మాటలు గారడీ చేయడం తప్పా ప్రజలకు చేసిందేమి లేదని సీపీిఐ జిల్లా కార్యదర్శి కె.విజయ రాములు విమర్శిం చారు. బుధవారం అమరచింత మండల కేంద్రం లోని అంబేద్కర్ భవన్లో సీపీఐ మండల అధ్యక్షులు అబ్రహం అధ్యక్షతన నిర్వహించిన పార్టీ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ భారత దేశానికి స్వతంత్రం తెచ్చేం దుకు ముందుండి పోరాటం చేసిన ఘనత ఒక్క సీపీఐ పార్టీకే ఉందన్నారు. తెలంగాణ తొలిదశ మలిదశ పోరాటాల్లో పాల్గొని అనేక మంది అమ రులైన ప్రత్యేక తెలంగాణ సాధించిన ఘనత సీపీఐ పార్టీకి ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీ తప్ప కార్మికులకు చేసిందేమీ లేదన్నారు. కెసిఆర్ పాలనలో ఆర్టీసీ కార్మికులు, ఉపాధి కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు. మున్సిపాలిటీ కార్మికులు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న సర్వీస్ పర్సన్స్, తదితర కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా పోరాటం చేస్తే విధుల నుండి తొలగిస్తాం అని బెదిరిస్తున్న నీచమైన రాజకీయాలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన , నోట్ల మార్పిడి, జీఎస్టి, అంటూ పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ నిత్యావసర సరుకులను ఆకాశాన్ని తాకే విధంగా పెంచుతున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కిందన్నారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉద్యమాలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 6, 7 తేదీల్లో జరిగే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్యామ్ సుం దర్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్య క్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కే.మోష , రవీందర్, కే.మల్లేష్, కుతుబ్, సింగంపేట రాము లు, అమర జ్యోతి వెంకటేష్,, మల్లేష్, ఆటో ఆంజనేయులు , నీసార్, బాలస్వామి, ఇజ్రాయిల్, చెన్నప్ప గీతమ్మ మాణిక్యమ్మ తో పాటు పలువురు పాల్గొన్నారు.