Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-ఉట్కూర్
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ల నిరుపేదలకు ఆర్థిక భరోసా ఇస్తోందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మల్లేపల్లి, చిన్నపొర్ల, పెద్దపొర్ల, కొల్లూరు తదితర గ్రామాల్లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ ప్రోసోడింగ్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల వద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు పింఛ న్లు అందజేసి చేసి చేయూత అందిస్తోందన్నారు. పేదల సంక్షేమం కోసం కెసిఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు త్వ పథకాలు వర్తిస్తాయన్నారు. అర్హత ఉన్న ఇప్పట ివరకు పింఛన్లు పొందని వారు వైరవీకారులను ఆశ్రయించకుండా మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీలక తీతంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా కషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో జడ్పిటిసి అశోక్ గౌడ్, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ జెడ్పిటిసి అరవింద్‌కుమార్, తహసిల్దార్ తిరుపతయ్య , ఎంపీడీవో కాళ్ళప్ప, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు మాలిపటేల్ రవీందర్ రెడ్డి, రవి ప్రసా ద్ రెడ్డి, శివ, బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు
అర్హులందరికీ అందిస్తాం: ఎమ్మెల్యే బీరం
చిన్నంబావి: అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందిస్తామని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ద న్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కొప్పునూరు, వెల్టూరు పెద్దదగడ పెద్దమా రూర్, లక్ష్మిపల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పేదరి కంతో బాధపడుతూ, అయినవాళ్లకు భారంగా మారుతున్నామనే భావనను వారిలో దూరం చేయటానికే సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ల పథకం అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.ఈ కార్యక్ర మంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పిటిసి వెంకట రమణమ్మ చిన్నారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ నరసిం హారెడ్డి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సర్పంచులు నంది కౌసల్య రాజేశ్వర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి లక్ష్మి పల్లె మద్దిలేటి రామస్వామి చక్రధర్ గౌడ్ చక్రవర్తి ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు,అధికారులు, టీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.