Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిండిన ఈదుల చెరువు
- మునిగిన స్మశాన వాటిక, పల్లె ప్రకతి వనం
- చెరువు ఆక్రమణవల్లే అంటున్న గ్రామస్తులు
నవతెలంగాణ-వెల్దండ
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రజాధనం నీటి పాలైందని మండల పరిధిలోని పెద్దాపూర్ గ్రావ ుస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ఈదుల చెరువు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీటితో నిండడంతో చెరువు సమీపంలో నిర్మించిన స్మశానవాటిక, పల్లె ప్రకతి వనం నీట మునిగాయి. ఈదుల చెరువు సమీపంలోని భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించడంతోనే చెరువు కుంచించుకు పో యి స్మశానవాటిక, పల్లె ప్రకతి వనం నీట మునిగి పోయాయంటున్నారు. హైదరాబాద్ - శ్రీశైలం , చెరుకూ రు గ్రామ మార్గంలో ప్రభుత్వం నిబంధనలను అతిక్ర మించి వెంచర్ ఏర్పాటు చేశారు. సమీపంలోని చెరువు భూమిని ఆకమ్రించి గోడ నిర్మించి అందులో ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి మట్టి తరలించి పోశారని దీంతో చెరువు నీటి సామర్థ్యం తగ్గిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు నీట ినిలువ సామర్థ్యం తగ్గడం వల్లే ప్రభుత్వం లక్షలు వెచ్చించి నిర్మించిన వైకుంఠధామం , పల్లె ప్రకతి వనాలు నీట మునిగాయంటున్నారు. నీట మునగడంతో వైకుంఠ దామంలోకి వెళ్లలేమని, పల్లె ప్రకృతి వనంలోని చెట్లన్నీ నీటమునిగాయంటున్నారు. ఇందుకు అధికా రులు, ప్రజాప్రతినిధులు నిర్లక్షమే కారణమని వారు ఆరో పిస్తున్నారు. చెరువు భూమి ఆక్రమణకు గైరందనడానికి నిదర్శనం వెంచర్లలో ప్రస్తుతం నిలువ ఉన్న నీరే నంటు న్నారు. ఇప్పటికైనా అధికారులు చెరువు ఆక్రమణపై విచారణ చేపట్టి ప్రభుత్వ భూమిని కాపడండంతో పాటు ప్రజాధనం వృధా కాకుండా చూడాలని కోరుతున్నారు.