Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరచింత
పేదలకు ప్లాట్లు హక్కు పత్రాలను ఇవ్వడంలో అలసత్వం సరైనది కాదని తక్షణమే లబ్ధిదారులకు హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజ నేయులు అన్నారు. ఆదివారం అమరచింత మండల కేంద్రంలోని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రెండో మహాసభలను నిర్వహించారు. ఈ సంద ర్భంగా ధూమ్ పాయి కుంట లో లబ్ధిదారులు చేస్తు న్న భూ పోరాటంలో ఆయన పాల్గొని తమ మద్దతు ప్రకటిస్తూ మాట్లాడుతూ. లబ్ధిదారులు చేస్తున్న భూ పోరాటాల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గతంలో పోరాటం చేస్తే పోరాట ఫలితంగానే 1997 లో 14 ఎకరాల 37 గుంటల భూమి లో 400 మంది పేదలకు 2 సెంట్లు భూములను ఇవ్వడం జరిగిందన్నారు. అట్టి భూములకు దాదాపు 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కూడా పొజిషన్ హద్దులు చూపించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. పేదల పట్ల ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు కార్పొరేట్ కంపెనీలకు వేల ఎకరాలను ధారాదత్తం చేస్తూ నీరు కరెంటు ఉచితంగా ఇస్తూన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ప్లాట్లు ఇవ్వడంలో అలసత్వం వహించడం సరైనది కాదని వెంటనే పేదలకు పొజిషన్ హద్దుల పత్రాలు ఇచ్చి అదే స్థలంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజరు,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్యన్ రమేష్, శంకర్, రామ్ రెడ్డి, మహేందర్, చిన్న అంజి, సుధాకర్, లక్ష్మణ్ షేక్ బాషా మోష, పలువురు పాల్గొన్నారు.