Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తకోట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాల్లో లబ్దిపొందుతున్న ప్రతి ఒక్కరు కేసీఆర్ కు అండగా నిలవాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తకోట మండలం ముమ్మలపల్లి, మిరాసిపల్లి, చర్లపల్లి గ్రామాలకు చెందిన పింఛన్ దారులకు ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముమ్మల్లా పల్లి గ్రామంలో 56 మందికి కొత్త పింఛన్లు మంజూరు అయ్యాయని తెలిపారు. 589 మంది రైతులకు రైతు బంధు ద్వారా 4 కోట్ల 70 లక్షలు వస్తున్నాయని అన్నారు. చనిపోయిన 5మంది రైతులకు 5 లక్షల చొప్పున అందజేశామని తెలిపారు. అలాగే కల్యాణ లక్ష్మీ పథకం ద్వారా 43మందికి చెక్కులను అందజేశామని తెలిపారు. అనంతరం మిరాసిపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏట మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంచడానికి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మిరాసిపల్లి చెరువులో లాంఛనంగా దేవరకద్ర ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్ కు భూమిపూజ, గుండె పోటుతో మరణించిన కార్యకర్త కుటుంబాన్ని పరామ ర్శించి 10వేలు ఆర్థికసాయం చేశారు.
టీఆరెస్ పార్టీలో చేరికలు
కొత్తకోట మండలం మిరాసిపల్లి గ్రామంలో కొండారెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి యువకులు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో టీఆరెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వాని ంచారు. కార్యక్రమంలో ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేషవ రెడ్డి, మాజీ జడ్పీటీసీ విశ్వేశ్వర్, రైతు సంఘం అధ్యక్షుడు కొండారెడ్డి, సర్పంచులు కష్ణయ్య, కుర్మయ్య, ఎంపీటీసీ శైలజ, టీఆరెస్ మండల ప్రధాన కార్యదర్శి అమ్మపల్లి బాలకష్ణ, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, పామపురం సింగిల్ విండో చైర్మన్ వాసుదేవ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రావణ్ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ యాదగిరి, ఆకుల శ్రీనివాసులు, ఎద్దుల నాగేష్, భీమ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, గులాబీ గోవింద్, విష్ణు, మునగారి కష్ణ, కిరణ్, వికాస్ పాల్గొన్నారు.