Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బాల్యనాయక్
నవతెలంగాణ- పాన్గల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమర వీరుల స్ఫూర్తితో ముందుకు సాగాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బాల్యనాయక్ అన్నారు. పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి తండాలో ఆదివారం సీపీఎం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రజెం డాలతో ప్రదర్శన నిర్వహిస్తూ బస్టాండ్ సెంటర్లో రైతాంగ సాయుధ పోరాట అమర వీరుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో బాల్యనాయక్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటం లో ఎంతో మంది అమరులయ్యారన్నారు. కమ్యూనిస్టుల నాయకత్వాన సుదీర్ఘంగా జరిగిన సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇది ఎర్రజెండా గొప్పతనమని గుర్తు చేశారు. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగి న పోరాటాల్లో నాలుగువేల మంది రక్తార్ఫణం చేశా రని ఆ పోరాట స్ఫూర్తితో వీరనారి చిట్యాల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, భీమిరెడ్డి, నర్సింహారెడ్డి , పుచ్చ లపల్లి సుందరయ్య, తాను నాయక్, మల్లు స్వ రాజ్యం వంటి ఎంతోమంది సుదీర్ఘ పోరాట ఫలి తంగా తెలంగాణ ప్రజలకు విముక్తి వచ్చిందని ఆయన అన్నారు. ఆనాటి నుండి నేటి వరకు కమ్యూనిస్టులు కార్మికులు, కర్షకులు, పీడిత ప్రజల విముక్తి కోసం నిరం తరం పోరాటం కొనసా గిస్తు న్నారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఏ సం బంధం లేకుండానే సాయుధ పోరాటంలో మా పాత్ర ఉందని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శిం చారు. దేశంలో కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. సాయుధ పోరాటాన్ని కూడా హిందూ ముస్లింల పోరాటంగా చిత్రీకరించి అవమానపరుస్తున్నారని ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పా లన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరా టానికి అసలుసిసలైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. నేటి పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో తెల్లరాళ్లపల్లి తండా సర్పంచ్ శాంతమ్మ, మహిళా సంఘం నాయకులు చిట్టెమ్మ , సిపిఎం గ్రామ కార్యదర్శి బాబునాయక్, సింగిల్ విండో డైరెక్టర్ బిల్యానాయక్, గిరిజన సంఘం నాయకులు ఆనంద్, సోమ్లా నాయక్ దేవమ్మ తదితరులు పాల్గొన్నారు.