Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర నాయకుడు పుట్ట ఆంజనేయులు
నవతెలంగాణ - బల్మూరు
పేదలకు హక్కులు దక్కాలంటే పాలకులు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు పుట్ట అంజనేయులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోసీపీఎం రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. శిక్షణ తరగతులకు సీపీఎం మండల కార్యదర్శి ఎం.శంకర్‌నాయక్ అధ్యక్షత వహించగా పుట్ట ఆంజనేయులు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 ఏండ్లలో పేద ప్రజలకు మేలు జరిగే సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ, బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ ఆస్తులను దారా దత్తం చేస్తోంద న్నారు. ప్రభుత్వ రంగ ఆస్తులను కాపాడుకోవాలంటే ప్రజా పోరాటాలు ఉధతం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే, విమానయానం వంటి అనేక రంగాలను కారు చౌకగా బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడ మంటే భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వే షన్ తొలగించడమేనని విమర్శించారు. రాజ్యాంగ విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలన్నారు. రిజర్వేషన్ తొలగించి బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలను అంధకారంలోకి నెట్టివేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పని చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలని ఆలోచన బీజేపీ చేస్తుందని అట్లాంటి ఆలోచనలు తిప్పి కొట్ట డం కోసం ఐక్యంగా ఉద్యమించాలన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్య నాయక్ మాట్లా డుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విము క్తి కోసం సాగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింలనే తేడా లేకుండా కలిసికట్టుగా నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసి పది లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడం జరిగిం దన్నారు. అట్లాంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్ర భాష్యం పలుకుతున్న బిజెపి నాయకులు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు. గత పాలకుల హాయంలో బల్మూరు మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేసి ఇళ్ల స్థలాలు దక్కించుకోవడం జరిగిందన్నారు. పోరాడి సాధించుకున్న ఇండ్ల స్థలాలను ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా పేదలకు తిరిగి ఇళ్ల స్థలాలపట్టాలిచ్చి ఇండ్లు నిర్మాణం చేసు కునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిచో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటా లు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో సిపిఎం మండల నాయకులు, మహేందర్ కాశన్న, బాలేశ్వర్, బాబర్, ఆంజనేయులు, భారీ మామ్, మాసయ్య, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.