Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయతీగా ఏర్పాడ్డా ఫలితం శూన్యం
- రోడ్డు సౌకర్యానికి నోచుకోని అంబగిరి
- హామీలు మరచిన ఎమ్మెల్యే
- స్థానికంగా ఉండని సర్పంచ్
- పారిశుధ్యంలోపించిన వార్డులు
- ఆవేదన వ్యక్తం చేస్తున్న గిరిజనులు
మారుమూల గిరిజన తండాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీల ను ఏర్పాటు చేసినా అవి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి... కొత్త గ్రామ పంచా యతీలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్న పాలకులు వాటి గురించే పట్టించుకోక పోవ డంతో కనీస వసతులు లేక ఆగ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నవతెలంగాణ - బల్మూరు
మండల పరిధిలో నల్లమల్ల అటవీ ప్రాంతం సమీపంలోని అంబగిరి గిరిజనులు (చెంచులు, లంబాడీ లు) నివసిస్తున్న గ్రామం. ఇక్కడ గిరిజనులు అధిక శాతం వ్యవసాయంపై ఆదారపడి జీవిస్తుంటారు. ఈ గ్రామం గతంలో అనంతవరం గ్రామపంచాయతీ ఆమ్లెట్ విలేజ్ గా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ఈ గ్రామం ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించినా ఫలితం లేదంటున్నారు ఈ గ్రామస్తులు. పాలకులు, నాయకుల అలసత్వం వల్ల గ్రామ పంచాయితీ అభివద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాడ్డాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పాఠశాలలోకి మార్చి అంగన్వాడీ భవనంలో గ్రామపంచాయతీ కార్యాలయాన్ని కొనసాగి స్తున్నా పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఏనాడు అక్కడికి రాక పోవడంతో అది పశువులు, గొర్రెలు, మేకలకు ఆవా సంగా మారిందంటున్నారు. అసలు సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదంటున్నారు గ్రామస్తులు.
అనంతవరం పిడబ్ల్యూ రోడ్డు నుండి ఈ గ్రామానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈ దారిలో నల్లచెరువు కట్టపై కిలోమీటర్ మేర రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నామం టున్నారు. ఎన్నికల సమయంలో నల్లచెరువు కట్టపై బీటీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజ రెండు సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారే గాని ఇప్పట్టి వరకు రోడ్డు పనులు ప్రారంభం కాలేదంటున్నారు. రోడ్డు సౌకర్యం లేకపో వడంతో గ్రామంలోకి కనీసం ఆటోలు కూడా రాని పరిస్థితి నెలకొందని దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని అంతర్గత రోడ్లు అధ్వాన్నంగా మారి పారిశుధ్యం లోపించి అనారోగ్యాలకు గురవుతున్నామని గ్రామస్తు లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికంగా ఉండని సర్పంచ్
గ్రామ సర్పంచ్ స్థానికంగా ఉండకపోవడంతో గ్రా మంలో సమస్యలు పేరుకుపోయాయంటున్నారు. సర్పంచ్ పట్టణంలో ఉంటూ ఎప్పుడు వస్తారో తెలియదంటున్నారు. సర్పంచ్ స్థానికంగా ఉండక పోవడంతో అనేక సమస్య లతో ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ప్రయోజనం లేదంటున్నారు.
గ్రామంలో వైకుంఠధామం నిర్మాణానికి యాపర్లోని చెరువులో స్థలం కేటాయించారని అది నేటికీ అసంపూర్తి గానే ఉందని పూరైనా చేరువులోకి నీరు వస్తే వైకుంఠధా మానికి వెళ్ల లేక పోతామంటున్నారు. గ్రామంలో కనీస వసతులు కల్పించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటువైపే రావడంలేదని గ్రామ యువకులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. గ్రామంలో ఇన్ని సమస్యలు ఉంటే ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎలా ఎంపికైతుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ఎమ్మె ల్యే స్పందించి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించడంతో పాటు అంతర్గత రోడ్లు, పారిశుధ్య పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.