Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ నాయక్
నవతెలంగాణ- కొల్లాపూర్ రూరల్
పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఎస్బిఐ బ్యాంకును తొలగించవద్దని తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ గిరిజన సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ఉన్న ఎస్బిఐ బ్యాంక్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ బి .శీకాంత్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్, ఎంపీటీసీ శంకర్ మాట్లాడుతూ కొల్లాపూర్ పురపాలక సంఘం కావడంతో బ్యాంక్లో అకౌంట్స్ లావాదేవీలు పెరగడంతో తప్పనిసరిగా రెండు బ్రాంచీలు కొల్లాపూర్ పట్టణంలోని రెండు బ్రాంచ్ లను ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగించాల న్నారు. దశాబ్దాల కాలంగా ఎస్బిహెచ్గా సేవలం దిస్తూ ఎస్బిఐగా ఏర్పడ్డ బ్యాంకు ఉన్న అకౌంట్ హౌల్డర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రజా సంఘాలు కుల సంఘాలు మహిళా సంఘాలు రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ దారులు వద్ధాప్య పెన్షన్ దారులు రైతులు పార్టీల నాయకులు వ్యాపారస్తులు ఏడు మండలాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బ్యాంకు తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొల్లాపూర్ పురపాలక సంఘం కావడంతో జనాభా అకౌంట్స్ లావాదేవీలు పెరగడంతో తప్పనిసరిగా రెండు బ్రాంచీలు కొల్లాపూర్ పట్టణంలోని వేరువేరు ప్రదేశాల్లో ప్రస్తుతం ఉన్న విధంగానే కొనసాగించే విధంగా చర్యలు తీసు కోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు దష్టి పెట్టాలన్నారు సాకులు చెప్పి తొలగించాలని చూస్తే గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో మల్లేష్ నాయక్ డి శంకర్ నాయక్ చంద్రు నాయక్ భాస్కర్ నాయక్ శివనాయక్ కాళహస్తి రఘువర్ధన్ జగదీశ్వర్ రెడ్డి మషన్న స్వామి వెంకట స్వామి మధు బ్యాంకు కస్టమర్లు పాల్గొన్నారు.