Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కొల్లాపూర్
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన దశలవారీ పోరాటంలో భాగంగా మంగళవారం యూఎస్పీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలం గాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టిఎస్ యూటిఎఫ్) జిల్లా నాయకులు మొహమ్మద్, జి.శివుడు, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శంకర్,యం.డి.రబ్బానిపాష, కోశాధికారి యం చంద్రశేఖర్లు పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని వివిధ పాఠశాలలో ప్రచారం చేస్తూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, 317 బాధితులకు న్యాయం చేయాలని, విద్యావాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికుల నియామకం తదితర సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా యుఎస్పీసీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11 నుండి హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ నం దు నిర్వహించ తలపెట్టిన రిలే నిరాహారదీక్షలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని రోజుకు 50 మం దితో శాంతియుతంగా చేసే నిరాహారదీక్షలకు కూడా అనుమతించలేని ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందుకు నిరసనగా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం చలో అసెంబ్లీ జరపాలని యుఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నిర్ణయించిందని కనుక బదిలీలు పదోన్నతులు కోరుకునే ఉపాధ్యా యులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజియా సుల్తాన, గఫూర్, కురుమ య్య, మునీశ్వర్, జయప్రసాద్, శ్రీదేవి, రాధిక, మాన స, సాలయ్య, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.