Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ కార్యాలయం ఎదుట పెన్షనర్ల ధర్నా
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రతి నెల 1వ తేదీ లోగా ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందియాలంటూ సోమవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ కే.రామదాసు మాట్లాడుతూ పెన్షనర్ల అపరిష్కత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. సీనియర్లకు బస్సు చార్జీల్లో 40 శాతం రాయితీ ఇవ్వాలని, పెన్సెనర్లకు ఆదాయయపు పన్ను పరిమితిని 10 లక్షలకు పెం చాలని డిమాండ్ చేశారు. సీనియర్ నాయకులు ఎన్.కిష్టయ్య మాట్లాడుతూ జిల్లాలో అన్ని వెల్నెస్ సెంటర్లలో శాశ్వత సిబ్బందిని నియమించాలని, మందులు, పరికరాలు సమకూర్చాలని, మెడికల్ రియింబర్స్మెంట్ 5 లక్షలకు పెంచాలని, హెల్త్ కార్డుల ద్వారా అన్ని కార్పొరేటు హాస్పిటల్స్లో వైద్యం అందించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పి.మ త్యుంజయరాజు, భాస్కర్ రెడ్డి,ప్రకాశరావు, మాణి క్యం రాజు, బాలరాజు, హనుమంతు,నరేష్ కుమార్, సుశీలయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.