Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-అలంపూర్
ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షలో ఎస్సీ, ఎస్టీల కటాఫ్ మార్కులు తగ్గిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు తెలిపారు. సోమవారం అలంపూర్‌లోని కెవిపిఎస్ కార్యాలయంలో ఆ సంఘ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభు త్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల్లో అభ్యర్థులకు రిజర్వే షన్ ప్రకారం ప్రత్యేక రాయితీతో మార్కులు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఓసి అభ్యర్థులకు మాత్రమే కటాఫ్ మార్కులు తగ్గిస్తామని ప్రకటించి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు, దీనిపై 10రోజులుగా సాగిన పోరా ట ఫలితంగా ముఖ్యమంత్రి కెసిఆర్ అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీల కటాఫ్ తగ్గిస్తా మని ప్రకటించారని తెలిపారు.
వనపర్తి రూరల్: ఎస్సై పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల్లో ఎస్సీ ఎస్టీ బీసీఅభ్యర్థులకు కటాప్ మార్కులు తగ్గిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించడం సామాజిక సంఘాల ఆధ్వర్యంలో అభ్యర్థులు నిర్వహించిన పోరాట ఫలిత మేనని కెవిపి ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంధం భగత్, దయపు రాధాకష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతకు కటాఫ్ తగ్గించారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నెగిటివ్ మార్కులు రద్దు చేయాలని తప్పులు దొర్లిన ఎస్సైలో 22 కానిస్టేబుల్14 మార్కులు కలపాలని డిమాండ్ చేశారు.