Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పి చైర్పర్సన్ పెద్దపల్లి పద్మావతి
నవతెలంగాణ- తెలకపల్లి
ముఖ్యమంత్రి కెసిఆర్ ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందు తోందని నాగర్ కర్నూల్ జిల్లా జడ్పీచైర్ పర్సన్ పద్మావతి బంగారయ్య అన్నారు. స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా సోమవారం తెలకపల్లి మండలం లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, రాకొండ గ్రామంలోని కెజిబి వి పాఠశాలను ఆమె సందర్శించారు. ఈసందర్భంగా భోజనశాల, తరగతి గదులు, టాయిలెట్స్, పాఠశాల ఆవర ణ పరిశీలించారు. తరగతి గదులు, భోజనశాలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదే ేశించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కల్పి స్తున్న అవకాశాలను సద్వినియోగంచేసుకుని భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగడానికి కషిచేయాలని విద్యార్థినులకు సూచించారు. తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుని కలలు కంటారని వారి కలలు నిజం చేయడానికి మీరు బాగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలన్నారు. విద్యార్థులకు మంచి విద్యతోపాటు నాణ్యమైన పౌష్టికర ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించి విద్యా బోధనతోపాటు ఆహారం, ఆరోగ్యము విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కొమ్ము మధు, రైతుబందు అధ్యక్షుడు మాధవరెడ్డి, మండ ల స్పెషల్ ఆఫీసర్ సురేశ్ మోహన్, ఎంపీడీవో చెన్నమ్మ ఎంపీటీసీలు ఆర్.రమేష్, విజయలక్ష్మి, లింగమయ్య ప్రిన్సిపాల్స్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరిస్తా
- వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి
అమరచింత: కస్తూర్బా పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తామని వనపర్తి జిల్లా జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం అమరచింత మండల పరిధిలోని పామిరెడ్డిపల్లి శివారులోని కస్తూర్బా పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి పూర్తి స్థాయిలో కషి చేస్తుందన్నారు. కస్తూర్బాలో చదువుతున్న విద్యార్తినులు చదువులో రాణించాలన్నారు. విద్యార్థినుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తమ దష్టికి తీసుకు వచ్చిన పాఠశాలకు రహదారి, తాగు నీటి సమస్య, విద్యుత్ తదితర సమస్యలను తక్షణమే పై అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసు కుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పావని వెంకట్‌రెడ్డి, జడ్పిటిసి మార్క్ సరోజా వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్.ఎ.రాజు, ఎంపీడీవో జ్యోతి, వైస్‌ఎంపీపీ బాల్‌రెడ్డి, రైతు సమన్వయ కమిటీ సభ్యులు చుక్కా ఆశీరెడ్డి , టిఆర్ఎస్ మండల అధ్య క్షులు రమేష్ ముదిరాజ్, మోహన్ రెడ్డి ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.