Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ రాజేందర్ సింగ్
కందనూలు: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఉన్నత విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ డా.రాజేందర్‌సింగ్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సమా వేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ న్యాక్‌లో మంచి గ్రేడ్ సాధించడానికి చేయవలసిన కషి, మెలకువలను వివరించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన, పోటీ పరీక్షల గురించి సరైన అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థులను పరిశోధన రంగం వైపు ఆసక్తి కల్పించేందుకు సిసిఈ వారు నిర్వహిస్తున్న జిజ్ఞాస ప్రాజెక్టులో, యువతరంగం కార్యక్రమాలలో ప్రతి విద్యార్థిని భాగస్వామ్యం చేయాలన్నారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ షాజహాన సుల్తానా , వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ డాక్టర్ మల్లేశం , మధుసూదన్ శర్మ , మదన్, స్వర్ణలత, రామచంద్రం, డిఆర్సి కోఆర్డినేటర్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ , అధ్యాపకులు పాల్గొన్నారు.