Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాల కలెక్టర్లు షేక్ యాస్మిన్ భాష ,వల్లూరు క్రాంతి
నవతెలంగాణ -వనపర్తి / ధరూర్
ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల''ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఈసీఓఈ ప్రజావాణి సమావేశ మందిరంలో ''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల'' ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ''తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల'' ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయిలో, నియోజవర్గ స్థాయిలో మూడు రోజుల పాటు జరిగే వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ నెల 16వ తేదీన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుంచి మెడికల్ కళాశాల వరకు 15 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టాలన్నారు. విద్యార్థులు, ఎన్.ఎస్.ఎస్, స్కౌట్స్, వివిధ శాఖల అధికారులు, ప్రజల సమన్వయంతో భారీ ర్యాలీ నిర్వహించాలని ఆమె తెలిపారు. మార్కెటింగ్ శాఖ, మున్సిపల్, పోలీసు శాఖ, డీిఆర్డీిఓ, డీిఈఓ, రెవెన్యూ, శాఖలు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆమె తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు, జడ్పీటీసీలు ,ఎంపీటీసీలు , సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొనాలని ఆమె తెలిపారు. 17వ తేదీన జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో జెండా ఆవిష్కరణ గావించాలని ఆమె సూచించారు. 14వవ తేదీ నుంచి 18వ తేదీ వరకు ట్రై కాలర్స్ లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. 17వ తేదీన జిల్లాలో ఉన్నటువంటి ఎస్టీ అధికారులు, సిబ్బంది, ఎస్సీ వర్గాల ప్రజలు వనపర్తి నుంచి ఎన్.టి.ఆర్. స్టేడియం, హైదరాబాద్కు తరలి వెళ్లాలని తెలిపారు. ఇందుకు అవసరమైన వాహనాలను, తాగునీరు, భోజన వసతి కల్పిస్తున్నట్లు ఆమె సూచించారు. ఆర్టీసీ, పోలీసు, ట్రాన్స్పోర్ట్, డి.సి.ఎస్.ఓ. శాఖలు నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె అన్నారు. 18వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో తెలంగాణ సాంస్క తిక సారథి కళాకారులచే సంస్క తిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్, (రెవెన్యూ) డి.వేణుగోపాల్, జిల్లా అధికారులు ధరూర్ అధికారులు ఆర్డీఓ రాములు ,జిల్లా అధికారులు, పాల్గొన్నారు.
- తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేయాలి: కలెక్టర్
నవ తెలంగాణ- వనపర్తి
జిల్లాలో ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని ఓటరు జాబితాను బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా పేర్కొన్నారు. సోమవారం సూర్యచంద్ర ప్యాలెస్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఓటరు జాబితా బలోపేతం గోడ పత్రిక పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు నమోదు తక్కువ ఉన్న గ్రామాలలో ఓటర్ నమోదు జాబితా త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఫారం-6 బి నింపి ఓటర్ గుర్తింపు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని మహిళా ఓటర్లకు సమాచారం అందించి చైతన్యం చేయాలని కలెక్టర్ అన్నారు. కొత్తగా ఓటర్ నమోదుకు ఫారం-6 వినియోగించి 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫారం-8 ద్వారా మార్పులు సవరణ ఇంటి చిరునామా వివరాలు దివ్యాంగులుగా గుర్తింపు వంటివి సవరించుకోవాలని అన్నారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈనెల 16న పాలిటెక్నిక్ కళాశాల నుండి మెడికల్ కళాశాల వరకు 15,000 మందితో ర్యాలీ ఉంటుందని, 17న జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయిలో జండావిష్కరణ, 18న పాలిటెక్నిక్ కళాశాలలో తెలంగాణ సాంస్క తిక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. ఈనెల 15న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి 19 సంవత్సరాల వారు ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలో, కళాశాలలో, అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకు మాత్రలు పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ప్రభుత్వ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్, డి.యం.హెచ్.వో.రవిశంకర్, డిపిఆర్ఓ రషీద్, డి.ఐ.ఈ.వో జాకీర్ హుస్సేన్ యుం. వి.ఐ.అవినాష్ నాయక్, యం.అర్.వో.రాజేందర్ గౌడ్, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రైవేట్ కళాశాల, ప్రైవేట్ పాఠశాలల ప్రిన్సిపాల్లు, జిల్లా అధికారులు, పి. ఈ. టి.లు తథితరులు పాల్గొన్నారు.