Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్ నగర్ కలెక్టరేట్
దేశం యావత్తు రాష్ట్రం వైపు చూస్తున్నదని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సంస్కతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం అయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ వద్ద 30 లక్షల రూపాయల వ్యయంతో అభివద్ధి పరచిన పిల్లలమర్రి కూడలిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సష్టికర్త మరియు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం దగ్గర్లోనే ఉన్న ఆసియా ఖండంలోనే రెండవదైన పిల్లలమర్రి వక్షాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ,అప్పటినుండే రాష్ట్రంలో సమద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని అన్నారు. ఈ మంచి కార్యంలో ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర ముఖ్యమైన తేదీలలో మొక్కలు నాటే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటేలా ప్రజలలో సామాజిక స్పహ కల్పిస్తున్నారని అన్నారు. వివిధ కారణాల వల్ల పిల్లల మర్రి వక్షం చనిపోఏ దశకు రాగా జిల్లా కలెక్టర్లు, అటవీశాఖ తదితర శాఖల సహకారంతో పిల్లల మర్రి మహావక్షానికి పునర్జీవం పోయడం జరిగిందని అన్నారు. జిల్లాలో గత సంవత్సరం రెండు కోట్ల విత్తన బంతులను తయారుచేసి డ్రోన్ కెమెరా ద్వారా గుట్టలు, కొండలలో, బంజరు భూములలో చెల్లించడం జరిగిందని, అంతేకాక విత్తన బంతులతో అతిపెద్ద వాక్యాన్ని రూపొందించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించామని, ఈ సంవత్సరం కూడా విత్తనబంతులు తయారుచేసి చల్లుతున్నామని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సష్టికర్త ఎంపి జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ పిల్లల మర్రి ని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు సొంత పిల్లల లాగా చూసుకుంటున్నారని, ఇందుకు కషి చేస్తున్న జిల్లా యంత్రాంగాన్ని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను ఆయన అభినందించారు. వివిధ కారణాలవల్ల పూర్తిగా పాడైపోయే దశకు చేరుకున్న పిల్లల మర్రి వక్షానికి సేలైన్లు ఎక్కించి బ్రతికించడమే కాక ,ప్రతి వేరును అభివద్ధి చేస్తున్న అధికార యంత్రాంగం అభినందనీయమని అన్నారు. పిల్లలమర్రి అభివద్ధి కోసం తన వంతు సహాయంగా 2 కోట్ల రూపాయలను ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు ,జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర క్రీడ అధికార సంస్థ అధ్యక్షులు అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి , రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్,జిల్లా రైతు బంధు అధ్యక్షులు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ కే.సీ నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ రహమాన్, డిసిసిబి ఉపాధ్యక్షులు కొరమోని వెంకటయ్య,మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ అటవీ శాఖ అధికారి సత్యనారాయణ ,మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, జిల్లా పర్యటక శాఖ అధికారి యు. వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు ,ప్రజాప్రతినిధులు ఉన్నారు.