Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికేడాదికీ తగ్గుతున్న అవార్డులు
- నామినేషన్లకు గడువు11 రోజులే
- నమోదు చేయడంలో ప్రధానోపాధ్యాయులు,సైన్స్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
విద్యార్థుల్లో దాగిఉన్న సజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ఇన్స్పైర్ అవార్డుల నమోదు ప్రక్రియ పేలవం గా మారింది. విద్యార్థుల ఆలోచనలకునుగుణంగా చేపట్టే ప్రయోగాల ఏర్పాటుపై సైన్స్ ఉపాధ్యాయులు, ప్రధానో పాధ్యాయులు అవగాహన కల్పించి పోటీలకు సిద్దం చేయాల్సి ఉన్నా వారు అంతగా శ్రద్ద చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నవతెలంగాణ- కందనూలు
నాగర్కర్నూల్ జిల్లాలో గత మూడేళ్లుగా ఇన్స్పైర్ అవార్డుల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన విద్యా శాఖ అధికారులు ఈ సంవత్సరం అంతగా శ్రద్ద చూపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్స్పైర్ అవార్డుల కోసం ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరించ నుండగా ఇప్పట్టి వరకు 253 మాత్రమే నామినేషన్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు.
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ చదివే విద్యా ర్థుల్లోని ప్రతిభను వెలికి తీసి భావి శాస్త్రవేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఏటా ఇన్స్పైర్ మనక్ అవార్డులు అందిస్తారు. అందుకుగాను విద్యార్థులు తమ ఆలోచనతో నూతన ఆవిష్కరణకు నాంది పలికేందుకుగాను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహకంగా ఒక్కో విద్యార్థికి రూ.10 వేలు అందిస్తోంది. వీటితో తన మస్తిష్కకంలో మెదిలిన ఆలో చనకు రూపమిస్తూ ఒక యంత్రం, లేదా నవీన పద్ధతికి రూపం ఇస్తూ ఒక నమూనాను తయారుచేసి ఇన్స్పైర్ ఎగ్జి బిషన్లో ప్రదర్శిస్తారు. ఉత్తమ నమూనాలుగా ఎంపికైన వాటికి జిల్లా, రాష్ట్రస్థాయి అవార్డులు అందిస్తారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 131 ఉన్నత పాఠశాలలో ఉండగా 43 ఉన్నత పాఠశాలల నుండి ఇన్స్పైర్ కు నమోదు చేసుకున్నాయి. జిల్లాలో 20 కస్తూరిబా గాంధీ పాఠశాల ఉండగా కేవలం 13 కేజీబీవీల నుండి మాత్రమే ఇన్స్పైర్ అవార్డులకు నమోదు చేసుకున్నాయి. జిల్లాలో 57 ప్రైవేటు హై స్కూల్ స్థాయి పాఠశాలలు ఉండగా ఒకటి మాత్రమే నమోదు చేసింది. రెండు మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ పాఠశాల ఉన్నా ఒకటి కూడా ఇన్స్పైర్ అవార్డులకు నమోదు చేసుకోలేదు. విద్యార్థుల్లో దాగిఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారిలో సాంకేతిక పరిజ్ఞాన్ని పెంపొందిచేందుకు ప్రభు త్వం నిర్వహిస్తున్న ఇన్స్పైర్ ప్రదర్శలను సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. .
చర్యలు తీసుకుంటాం
-జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు
ఇన్స్పైర్ అవార్డుల నమోదుపై జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులును వివరణ కోరగా యాజమాన్య పాఠశాలలు విద్యార్థులకు ఇన్స్పైర్ అవార్డులపై అవగా హన కల్పించి నమోదును పెంచాలన్నారు. అందుకు ప్రధా నోపాధ్యాయులు, సైన్స్ ఉపాధ్యాయులు శ్రద్ధ తీసు కోవాల న్నారు. నమోదు చేయని పాఠశాలలపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అవగాహన కల్పిస్తున్నాం
ఇన్స్పైర్ అవార్డుల కోసం నమోదు చేసుకునేలా ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తున్నాం. ఎన్సీఆర్టీ డైరెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం అన్ని యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయులతో నమోదు ప్రక్రియను పెంచేలా ఆన్లైన్ సమావేశం నిర్వహిస్తున్నాం.
-కృష్ణారెడ్డి, జిల్లా సైన్స్ అధికారి