Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఊట్కూర్
మండల కేంద్రంలోని మండల అభివద్ధి కార్యాలయంలో మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆధ్వర్యంలో మండల టాస్క్‌ఫోర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సంద ర్భం గా ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలకు, ఆరోగ్య సిబ్బందికి జాతీయ నులిపురుగుల నివా రణ దినం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్ర మం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయికుమార్ ఆరోగ్య విస్తరణ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ ఈనెల 15 న ఒకటి నుండి 19 సంవత్సరముల వయసు గల పిల్ల లందరికీ ఆల్బెండజోల్ మాత్ర పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఒకటి నుండి ఐదు సం వత్సరంల వయసు వారికి అంగన్వాడి కేంద్రంలో 6 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు పాఠశాలల్లో, కాలేజీలలో ఆల్బెండజోల్ మాత్ర పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒకటి నుండి రెండు సంవత్సరంల వయస్సు వారికి సగం మాత్ర ఆల్బెండజోల్ మాత్రను పొడిచేసి పాలల్లో గాని నీళ్లతో కలిపి కానీ త్రాపించవచ్చు. రెండు నుండి 19 సంవత్సరంల వయసు వారు ఒక మాత్రను చప్పరించి నమిలి మ్రింగాలి. ఈ ఆల్బెండజోల్ మాత్ర మింగించడం వల్ల పిల్లల యొక్క రక్తహీనత ,పోషకాహార లోపం, బరువు తగ్గుట ,ఏకాగ్రత లోపించటం మొదలైన లక్షణా లన్నీ కూడా రాకుండా నివారించ గలుగు తుందన్నారు జ్వరముతో గాని వేరే అనారోగ్య కారణాలతో బాధపడుతూ ఉండే పిల్లలకు ఈ మాత్రల పంపిణీ జ్వరము గానీ అనారోగ్యం కానీ తగ్గిన తర్వాత ఇవ్వాలన్నారు. గురువారం రోజు మాత్రలు తీసుకోకుండా మిగిలిన పిల్లలకు ఈనెల 22వ తేదీన ఆల్బెండజోల్ మాత్ర పంపిణీ వేయా లని సూచించారు ఈ సమావేశములో వైద్యాధికారి డాక్టర్ సాయికుమార్ ,ఆరోగ్య విస్తరణాధికారి విజ రు కుమార్, పర్యవేక్షకురాలు మణిమాల ,ఆరోగ్య కార్యకర్తలు కవిత ,మహేశ్వరి, సుజాత అంగన్వాడి కార్యకర్తలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
పెద్దకొత్తపల్లి : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంగళవారం మండల ఆశా వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు ,ఏఎన్ఎం లకు, ప్రధానోపాధ్యాయులకు, చిన్నపిల్లల నుంచి 15 సంవత్సరాలు నిండిన వారికి వచ్చే నట్టల వ్యాధి నివారణ పై ఆరోగ్య విస్తరణ అధికారి దేవేందర్ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు గల పిల్లలకు మాత్ర సగం వేయాలని, అదేవిధంగా 2 సంవత్సరాలకు పైబడిన చిన్నారులకు 15 సంవత్సరాలు గల విద్యార్థిని, విద్యార్థులకు పూర్తి ఒక మాత్ర వేయాలని, ఈ మాత్రలను ఈనెల 15 నుంచి పంపిణీ చేస్తామని అదేవిధంగా రెండవ విడత ఈనెల 20వ తేదీన మిగిలిన పిల్లలకు విద్యార్థులకు వేయడం జరుగుతుందని, ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రశాంత్ ,హెల్త్ సూపర్వైజర్ బాలాజీ సింగ్, మండల ఆశా వర్కర్లు ,అంగన్వడి టీచర్లు మరియు ఏఎన్ఎంలు, మండల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
కోడేరు: మండల కేంద్రంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్ కేజీబీవీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు నులి పురుగుల నివారణపై ఒక్కరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో డాక్టర్ మౌనిక మాట్లాడుతూ ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలకు 15న ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయాలని సూచించారు. పిల్లలకు నులిపురుగుల వలన కడుపునొప్పి ,ఆకలి కాకపోవడం, వీక్‌గా ఉండడం పిల్లల్లో సాధారణంగా ఉండే లక్షణాలు అని తెలి పారు. పై మూడు లక్షణాలు ఉన్న పిల్లలకి కచ్చి తంగా గురువారం ఉదయం భోజనం తర్వాతనే ఆల్బెండజోల్ టాబ్లెట్లు వేయాలని ప్రధానో పాధ్యాయులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.