Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేట జిల్లా కలెక్టర్ హరిచందన
- అధికారులతో సమీక్ష సమావేశం
నవతెలంగాణ- నారాయణపేట టౌన్
ఈ నెల16, 17, 18 తేదీల్లో నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిం చేందుకు ప్రణాళికలు రూపొదించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశిం చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పి ఎన్.వెంకటేశ్వర్లు, అడిషనల్ కలెక్టర్ పద్మజారాణి, జిల్లా అధికారులతో సమైక్యత వజ్రోత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్ర మంలో భాగంగా 16న జిల్లాలోని మూడు మున్సి పాలిటీలలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సభ నిర్వహించాలని, వచ్చిన ప్రజలకు భోజన వసతులు ఏర్పా టు చేయాలన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని క్రీడా మైదానం నుండి ర్యాలీ ప్రారంభమై అంబేద్కర్ చౌర స్తా, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, సివిల్లైన్ ,వీర సావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా మీదుగాశెట్టి ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్కడే బహి రంగ సభ నిర్వహించాలన్నారు. ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన వసతులు ఏర్పాటు చేయాలని సూచిం చారు. దాదాపు 10 వేల జాతీయ పతాకాలను ర్యాలీలో ఇవ్వాల్సి ఉంటుందని వాటికి కర్రలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. జాతీయ పతాకాలను కింద వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ర్యాలీకి 108 వాహనం, ప్రాథమిక చికిత్స కిట్లు అందు బాటులో ఉంచాలని వైద్యాధికారిని ఆదేశించారు. 17న పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఉంటుందని అదే రోజు ఉదయం జిల్లాలోని గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు, ఆసక్తి ఉన్న గిరిజన మహిళా సంఘాల ప్రతినిధులను బస్సుల ద్వారా హైదరా బాద్ ఎన్టీఆర్ గార్డెన్లో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమానికి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ మండలాలు మున్సిపాలిటీల వారిగా దాదాపు 20 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి బస్సుకు ఒక కానిస్టేబుల, మండల అభివద్ధి అధికారి ఉంటారని తెలిపారు. వచ్చిన వారికి భోజన వసతులు అన్ని ఏర్పాట్లు ఉంటాయని అన్నారు. ఉదయం 8 గంటలకు ఆయా ప్రాంతాల నుండి బస్సులు బయలుదేరుతాయని ఉదయం 5 గంటల వరకు బస్సులను ఆయా మండలా లకు, మున్సిపాలిటీలకు పంపే విధంగా ఆర్టీసీ డిపో మేనేజ ర్ ను ఆదేశించారు. 18న స్థానిక అంజన గార్డెన్ ఫంక్షన్ హాల్లో సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహించడం జరు గుతుందని కలెక్టర్ తెలిపారు. 15వ తేదీ నుండి అన్ని ప్రభు త్వ, ప్రైవేటు కార్యాలయాలపై త్రివర్ణ రంగు విద్యుత్ లైట్లు పెట్టించి అందంగా ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. ఈ వజ్రోత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజలను పెద్ద మొత్తంలో భాగస్వాములు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీఎన్.వెంకటేశ్వర్లు ,అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ కే. చంద్రరెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ పద్మజరాణి, ఆర్డీవో రామచంద్రనాయక్, జిల్లా అధికారులు డీిఎస్పి సత్యనారాయణ ,మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.