Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అచ్చంపేట రూరల్
విభిన్న రాష్ట్రాల భాషల మధ్య వారధి హిందీ లని హిందీ ఉపాధ్యా యులు డాక్టర్ కమలేకర్ నాగేశ్వర్ రావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ అందరికీ అర్థమ య్యే ఒక భాష హిందీ అవసరం. నాటినుండి నేటి వరకు ఆ అవసరం తీర్చుతున్న భాష హిందీ.1947 స్వాతంత్య్రా నంతరం హిందీ జాతీయ భాష అవుతుందని అందరూ స్వాభావికంగా భావించారు. 14 సెప్టెంబర్ 1949 న 324 మంది సభ్యులున్న భారత రాజ్యాంగ సభలో 312 మంది హిందీ కే తమ మద్దతు తెలిపి భారతీయుల ఆశను చరితార్థం చేశారు. భారతదేశం మరియు ఇతర దేశాల్లోని ప్రజలు కూడా హిందీ మాట్లాడుతారు, చదువు తారు, రాస్తారు. మారిషస్, గయానా, ఫిజీ, సూరీ నామా, నేపాల్, సంయుక్త అరబ్ దేశాల ప్రజలు కూడా హిందీ మాట్లాడుతారు. ఫిబ్రవరి 2019 లో అబుదాబి న్యాయస్థానంలో హిందీకి మూడవ భాషగా గౌరవ స్థానం లభించింది. న్యూజిలాండ్ లో అత్యధికంగా మాట్లాడే భాషల్లో హిందీ నాలుగో స్థానంలో ఉంది.2001 జనగణన ప్రకారం భారతదేశంలో 42 కోట్ల 20 లక్షల మంది హిందీ తమ మూల భాషగా పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్, పాకిస్తాన్ మరియు ఇతర దేశాలన్నింటిలో దాదాపుగా 24 కోట్ల మంది మాట్లాడే ఉర్దూ, మౌఖి కంగా హిందీకి సమానంగా ఉంది.మహాత్మాగాంధీ 1906లో 'ఇండియన్ ఒపీనియన్' అనే పత్రిక ద్వారా 'దేశ సమైక్యత, సౌభ్రాతత్వం కోసం అత్యధికంగా మాట్లాడే హిందీ యే జాతీయ భాషగా ప్రోత్సహించ తగినదని' పేర్కొన్నారు. 22 ఆగస్టు 1949న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ద్వారా జరిగిన ఒక తీర్మానం ప్రకారం హిందీ ని జాతీయ భాషగా గుర్తిస్తూ, 15 సంవత్సరాల వరకు హిందీతో పాటు ఆంగ్లం కూడా రాజ భాష (అధికార భాష)గా ఉంటుందని పేర్కొన్నారు. దేవనాగరి లిపి,అక్షరాలు, అంకెలు, వాటి ప్రయోగం గురించి విస్తత చర్చలు జరిపి చివరికి 14 సెప్టెంబర్ 1949 న హిందీకి అధికార భాష హౌదా కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 (1) నుండి ఆర్టికల్ 352 వరకు అనేక నిబంధనలతో కూడి దేవనాగరి లిపిలో హిందీకి అధికార భాష హౌదా నిర్ణయం తీసుకున్నారు. ఇంతటి చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రతి రంగంలో వ్యాపింప చేయుటకు రాష్ట్ర భాషా ప్రచార సమితి, వర్దా - వారి కోరిక మేరకు 1953 నుంచి భారతదేశంలో లో ప్రతి సంవత్సరం 14 సెప్టెంబర్‌ను హిందీ దినోత్సవంగా చేసుకుంటారని గుర్తుచేశారు. మొదటిసారిగా ఐక్యరాజ్యసమితిలో 1977లో అటల్ బిహారీ వాజ్ పేయి హిందీలో ప్రసంగించారు. ఆ తర్వాత 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, 2015, 2016 లో నాటి విదేశాంగ మంత్రిగా ఉన్న సుష్మాస్వరాజ్ ప్రసంగించారు.దేశ సమైక్యతను, సౌభ్రాతత్వాన్ని పెంపొందిస్తూ, విభిన్న రాష్ట్రాల భాషల మధ్య వారధిగా పనిచేస్తున్న హిందీని, కేంద్రం నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా 2019 ద్వారా అన్ని రాష్ట్రాల్లో పాఠశాల, కళాశాల, డిగ్రీ కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో కచ్చితంగా అమలు చేస్తుందని ఆశించినా,అది నిరాశగానే మిగిలింది. అంతేగాక పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పత్తిని పెంచటంతో ఇప్పుడు పని చేస్తున్న హిందీ భాషోపాధ్యాయులపై మరింత భారం పడుతోంది.కావున ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించి హిందీ భాషాభివద్ధికి అడుగులు వేయాలని కోరారు.