Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎగువన కురుస్తున వర్షాలతో బ్రిడ్జిని ముంచేసిన వరద
- అత్యవసర వైద్యసేవలకు ప్రమాదకర పడవలే దిక్కు
- బ్రిడ్జి ఎత్తును పెంచి రవాణా సౌఖర్యాన్ని మెరుగుపర్చాలి : సర్పంచి కృష్ణవేణి
నవతెలంగాణ- అచ్చంపేటరూరల్
బ్రిడ్జి ఎత్తును పెంచి రవాణా సౌఖర్యాన్ని మెరుగుపరుచాలని అక్కారం సర్పంచి కృష్ణవేణి కోరారు. తగ్గుమొఖం పట్టకుండా గత కొన్ని రోజులుగా కురుస్తున వర్షాలకు దుందిబి నది పొంగిపొర్లుతున్నది అని దింది ప్రాజెక్టు నుండి అలుగుపారుతుండటంతో గత 15 రోజుల నుండి అక్కారం ,బొల్లారం గ్రామాల మధ్యన వున్న బ్రిడ్జిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కారం నుండి దేవరకొండకు నిత్యము వెళ్లే గ్రామస్తులకు రావాణా సౌఖర్యం పూర్తిగా నిలిచిపోయాయని అక్కారం గ్రామ సర్పంచు కృష్ణవేణి మంగళవారం అన్నారు. బక్కలింగా యపల్లి, అక్కారం, బండ తాండ, ఆంజనేయులు తాండ, ధండ్యాలం తాండ, ఘణపూర్ గ్రామస్తులు ప్రతిరోజు నిత్యావసర సరకుల కొనుగోలు, వైద్య సదుపాయం, అంగడి సంత క్రయ, విక్రయాలకుగాను దాదాపు 25 కిలోమీటర్ల సమీపంలో వున్న దేవరకొండ పట్టణంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నామని అన్నారు. విపత్కాల పరిస్థితు లేదురైతే ప్రమాదకరమైన పడవల ద్వారా నదిని దాటాలని లేదంటే 60 కిలో మీటర్ల దూరములో వున్న అచ్చంపేటకు వెళ్లవలసి రావడం వల్ల అత్యవసర పరిస్థితులలో వైద్యానికి కూడా దూరమవుతున్నామని ఆవేదన చెందారు. ఎప్పుడు వరద వచ్చినా మాకు ఈ కష్టాలు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పర్యాయం ఎడతెరపి లేకుండా కురు స్తున్న వర్షాల వల్ల గత 15 రోజులుగా మాకు రవాణా సౌఖర్యం పూర్తిగా బంద్ కావడం వల్ల వైద్య సౌఖర్యానికి, నిత్యావర సరుకులు, ఔషదాలకు దూరమై తీవ్రమైన అవస్థలు పడుతున్నామని ఆవేదన వెళ్లిబుచ్చారు. ఎప్పుడు వర్షాలు పడినా మాకు ఈ తిప్పలు తప్పడం లేదని విచారం వెళ్ళిబుచ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు మా ధీనస్థితిని అర్థం చేసుకొని ప్రస్తుతం వున్న బ్రిడ్జి ఎత్తును మరో పది ఫీట్లకు పెంచినట్లయితే మాకు ఈ సమస్య నుండి శాశ్వత విముక్తి లభిస్తుందన్నారు. అదే సమయానికి రంగాపూర్ సర్పంచ్, అచ్చంపేట ఎంపీపి భర్త లోక్యానాయక్, తెరాసా నాయకులు అక్కడికి చేరుకొని పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టకి తీసుకెళ్లుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కే. బోడ, వి. జగ, ఎం. లచ్చిరాం, సి. లింగయ్య, కె. లచ్చిరాం, కే. హన్మ, బాబూరాం తదితరులు పాల్గొన్నారు.