Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్‌చారి
నవతెలంగాణ- కందనూలు
పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబ ర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అరవింద్‌చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలో విద్యార్దులతో కలిసి విలేకరులతో మాట్లా డుతూ తెెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్న సీఎం కేసీఆర్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమయ్యారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1200 వందల మంది ఉద్యమకారులు ఆత్మ బలి దానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఉచింతంగా కేజీ టు పీజీ విద్య అందిస్తమని దాన్ని గాలికి వదిలేశారన్నారు. చిన్న చిన్న ప్రైవేటు కళాశా లలు ప్రభుత్వం ఇచ్చే ఫీజురియింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌ల పైన నడుస్తాయని స్కాలర్షిప్లు ఇవ్వడంలో ప్రభుత్వ జాప్యం వల్ల ప్రైవేట్ కళాశాలల యాజ మాన్యాలు కళాశాలల బిల్డింగ్ రెంట్స్. బోధన సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అయో మయంలో ఉన్నారని. దీని కారణంగా ఇంటర్మీ డియట్ , డిగ్రీ అయి పోయిన విద్యార్థులకు ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యాలు అంటున్నాయన్నారు. అటు విద్యార్థులు, ఇటు కళాశాల యాజమాన్యాలకు ఇబ్బందులు పడుతూ ఎటు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలైన వాటికి ప్రభుత్వం విద్య హక్కు చట్టానికి వ్యతిరేకంగా వారికి అండగా ఉండటంవల్ల వాళ్లు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభు త్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దష్టిలో ఉంచుకొని స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీనీ ముట్టడ ిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో శివకుమార్, ఆంజనేయులు, సునీల్, నరేందర, గణేష్, వంశీ, అన్నామని, గాయత్రి, శిరీష, రహేళ, తేజ, నందిని, మహేశ్వరి, ఐశ్వర్య, వైశాలి, ఛార్మిక విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.