Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ సంయుక్తకర్త జనంపల్లి అనిరుద్‌రెడ్డి
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష
నవతెలంగాణ-బాలానగర్
నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పరిష్కా రం అయ్యేవరకు పోరాటం ఆగదని టీపీసీసీ సం యుక్త కర్త జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జనుం పల్లి అనిరుద్‌రెడ్డి అన్నారు. నియోజక వర్గంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల సమస్యలను పరిష్కరించాలంటూ మం గళవారం ఆయన తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు పంపిణీ, గ్రామీణ ప్రాంతాల రోడ్లు అధ్వనంగా మారాని ప్రయాణానికి ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. పింఛన్లు రాక వృద్ధులు ఇక్కట్లు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలన్ని పరిష్కరించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి వందలాది మంది మహిళలు, వద్ధులు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రజా నాట్యమండలి సభ్యులు ప్రజలను ఆకట్టుకునే విధం గా పాటలు పాడారు. ఈ కార్యరకమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆది రమణారెడ్డి, నాయకులు లింగారం నరసింహారెడ్డి, వెంకట్‌నాయక్, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దరేవెల్లి రోడ్డు బాగు చేయించండి
మండలంలోని పెద్దరేవెల్లి రోడ్డును బాగు చేయించండని అనిరుద్‌రెడ్డి జిల్లా కలెక్టర్ వెంకట్రావు కు వినతి పత్రం అందజేశారు. అప్పాజీపల్లి క్రషర్ మిషన్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం అప్పాజీపల్లికి వెళుతున్న కలెక్టర్‌ను అనిరుద్‌రెడ్డి, మండల కాంగ్రెెస్ పార్టీ అధ్యక్షులు ఆది రమణారెడ్డి, లిం గారం నరసింహారెడ్డి, వెంకట్ నాయక్ తదితరులు కలిసి పెద్దరేవెల్లి రోడ్డు ఆధ్వానంగా మారి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించి వెంటనే మరమ్మతు చేయిం చాలని కోరారు. స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.