Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనుల నాణ్యతలో రాజీపడొద్దు
- జిల్లా కలెక్టర్ పి.ఉదరుకుమార్
నవతెలంగాణ- కందనూలు
జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమం కింద మొదటి విడతగా చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదరు కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమా వేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల జాప్యంపై కలెక్టర్ అసంతప్తి వ్యక్తం చేశారు. అనం తరం కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మన బడి పను లను ఇంజనీరింగ్ శాఖాధికారులు ప్రత్యేక శ్రద్ధతో త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆయా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయా ఎజెన్సీలతో సమన్వయం చేసుకొని పనులు త్వరగా పూర్త య్యేలా చూడాలని ఈఈలను ఆదేశించారు. మొదటి విడ త ఎంపికైన పాఠశాలలను ఇంజనీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి ప్రతి పాఠశాలలో 30 మంది విద్యా ర్థులకు ఒక్కో తరగతి గది ఉండేలా నివేదికలు తయారు చేసి రేపు సాయంత్రం లోగా ఆన్లైనో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో 290 పాఠశాలలను మొదటి విడత లో ఎంపిక చేశామన్నారు. ఇప్పటికే 272పాఠశాలలకు పరిపాలనాపరమైన అనుమతు ఇచ్చామన్నారు. ఇందులో రూ.30లక్షల లోపు అంచనా గల 66 పాఠశాలలు ఉన్నా యని, వాటిని అన్నిటిని టెండర్లు పూర్తి చేసి పాఠశాలలు గ్రౌండింగ్ పూర్తిచేయాలని పేర్కొన్నారు. గ్రౌండ్ అయిన పాఠశాలలకు 15 శాతం నిధులను పాఠశాల నిర్వహణ కమిటీిల ఖాతాలకు బదలాయిం చామని, ఇప్పటివరకు 4 కోట్ల 11 లక్షల రూపాయలు విడుదల చేశామన్నారు కలెక్ట ర్ పేర్కొన్నారు. టెండర్ కు వెళ్లాల్సిన పాఠశాలల పనులను వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను పూర్తి చేసి, ్ల పనులు వేగవంతం చేయాలని సూచించారు. పనుల నాణ్యత విష యంలో రాజీపడొద్దన్నారు. అన్ని పనులకు సంబంధించి వచ్చే వారంలోగా పురోగతి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశా రు. ఆర్అండ్బి ఏఈ సంపత్ కొల్లాపూర్ మండ లంలోని పనుల పర్యవేక్షణ బాధ్యతలు తీసుకొని కారణంగా అతని వేతనం నిలిపి వేయాలంటూ డీటీఓకు లెటర్ రాయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ మనుచౌదరి, ఈఈలు దామోదర్‌రావు, రామచంద్రరావు, డిప్యూటీ ఈఈలు దుర్గాప్రసాద్, రమాదేవి, ప్రతాప్, సెక్టోరి ల్ అధికారి బరపటి వెంకటయ్య, ఈడిఎం నరేష్, టెక్నికల్ అసిస్టెంట్లు రఘు, సాయి, మండలాల విద్యాఅధికారులు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్‌కు దీటుగా అభివృద్ధి
- జిల్లా సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్
ఉట్కూర్: మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌కు దీటుగా అభివద్ధి చెందుతున్నాయని జిల్లా సెక్టోరియల్ అధికారి శ్రీనివాస్ ఎఫ్ఏఓ మంజుల అన్నారు మంగళవారం మండల పరిధిలోని నిడుగుర్తి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠ శాల, పులిమామిడి గ్రామంలోని కేజీబీవీ పాఠశాలను వారు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి కార్యక్ర మం లో భాగంగా చేపడుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని అంద రూ ఉపాధ్యాయులు బాధ్యతయుతంగా నిర్వహించి విద్యార్థుల్లో వంద శాతం సమర్త్యాలు పెంచే విధంగా కషి చేయాలని సూచించారు. స్వచ్చ్ పక్వాడ కార్యక్రమాన్ని రోజు వారీగా నిర్వహించాలని, అలాగే ఈ నెల 15 న నేషనల్ దివార్మింగ్ డేను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఏఓ మంజుల, ఉపాధ్యాయులు వెంకటప్ప, పద్మ, సునీత, ఆంజనేయులు, సలాం, సుజాత, తదితరులు పాల్గొన్నారు.