Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : జిల్లాలో ఎక్కడా కూడా బాల్య వివాహాలు జరగకుండా గ్రామాలల్లో అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి సూచించారు. మంగళవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో ''బాలల హక్కులు- చట్టాలు'' పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యవివాహాలతో అనేక అనర్థాలు జరుగుతాయని తెలిపారు. ఆడపిల్లలకు (18) సంవత్సరాలు నిండిన తరువాత వివాహం చేయాలన్నారు.14 సంవ త్సరాల లోపు బాలబాలికలను పనిలో పెట్టు కోరాదని, వారిని గుర్తించి బడిలో చేర్పిం చాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భి ణులకు, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పౌష్టి కాహారం అందజేయాలని ఆయన సూచించారు. పిల్లల శారీరక, మానసిక, ఆరోగ్యకరమైన ఎదుగుదలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని ఆయన తెలిపారు. గ్రామాలలో ప్రజలకు విస్తత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. డీడబ్ల్యూఓ పుష్పలత మాట్లాడుతూ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా 0-6 సంవత్సరాల చిన్నారులకు ప్రీ స్కూల్ విద్యను, మైనర్ బాల బాలికలకు, ఆపదలో ఉన్న స్త్రీలకు సఖి కేంద్రం ద్వారా సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నట్లు, 24 గంటల సేవలు అందుబాటులో ఉన్నట్టు ఆమె తెలిపారు. చిన్న పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అంద జేస్తున్నట్లు ఆమె సూచించారు. గ్రామ సర్పంచులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, పోలీస్, రెవెన్యూ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రజలలో అవగాహన కల్పించి బాలల పరిరక్షణకు కృషి చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్,డీఎంహెచ్ఓ రవిశంకర్, డీఆర్డీఓ. నరసింహులు, డీపీఓ సురేష్, ఎసిఎల్బి, వైస్ చైర్మన్, జడ్పీటీసీలు,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఐసీడీఎస్ సిబ్బంది, అధికారులు, మండల అధికారులు, పాల్గొన్నారు.