Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరదలు తగ్గేదేలే..
- నిండుకుండలా జూరాల, శ్రీశైలం
- 45 రోజులుగా నదులు పరవళ్లు
- శ్రీశైలం దాటి పారుతున్న కృష్ఱ
- రిజర్వాయర్లు ఉంటే రబీలోనూ..సాగునీరు
నీళ్లు పరవళ్లుతొక్కుతున్నాయి. శ్రీశైలం జూరాల రిజర్వాయర్లు నిండుకుండను తలపిస్తున్నాయి.గతంలో ఎన్నడూ లేనివిధంగా 45 రోజులుగా నదులు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడు పారుతున్న నీటిని మనం రిజర్వు చేసుకుంటే....వచ్చే రబీకి సాగునీరు పుష్కలంగా ఇవ్వవచ్చు. ఇప్పటికైనా నూతనంగా రిజర్వాయర్లు ఏర్పాటు చేసి వ్యవసాయానికి నిరంతరం సాగునీరివ్వవచ్చు.ఆదిశగా పాలకులు స్పందించి సాగునీటిపట్ల దృష్టి సాధించాలని పలు పార్టీలు ప్రజా సంఘాలు కోరుతున్నారు.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
కృష్ణానది ఏటా 20 రోజులకు మించి వరదలు వచ్చేవి కావు. మూడు నాలుగు రోజులు శ్రీశైలం, జూరాల గేట్లు తెరిచి ఉంచేవారు. ఈ ఏడాది అలా కాదు ఏకంగా 45 రోజులుగా వర్షం పాటు తుంగబద్ర, కృష్ణానదిలో వరదలు వస్తున్నాయి. శ్రీశైలం, జూరాల గేట్లు ఎత్తేశారు. 45 రోజులుగా ఇంత స్థాయిలో నదులు రావడం ఇదే మొదటి సారి.ఇప్పటికీ నీటి వరద తగ్గడం లేదు. వారం రోజుల క్రితం కృష్ణానదిలో 3.50 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ఇప్పుడు రెండు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.నారయణపూర్ 60675 క్యూసెక్కులు, జూరాలకు రెండు లక్షల క్యూసెక్కుల నీరు, తుంగబద్రకు 34 వేల క్యూసెక్కుల నీరు శ్రీౖశైలం ద్వారా 2.60 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 45 రోజులుగా వరదలు నిలకడగా ఉన్నాయి. శ్రైశలం జూరాల గేట్లు తెరవడం వల్ల యాత్రికులు సందడి చేస్తున్నారు.
రిజర్వాయర్లు నిర్మాణం చేస్తే...రబీకి సాగునీరు
ఉమ్మడి జిల్లాలో ఉన్న సాగునీటి వనరుల ఉపయోగం కోసం లోతట్టు ప్రాంతాలలో రిజర్వాయర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ రిజర్యావర్ల కోసం అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సమీపంలో గతంలో 40 రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇప్పటి వరకు ఒకటైనా పూర్తి చేయాలేదు. పాలమూరు రంగారెడ్డితో పాటు దుందుబీ నది పరివాహక ప్రాంతంలోనూ... రిజర్వాయర్లు నిర్మాణం చేయాల్సి ఉంది. వర్షాకాలంలో అయితే సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందు తోంది.రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసుకుంటే ఖరీఫ్ మాదిరిగా రబీలోనూ...పంటలకు సాగునీరు ఇవ్వవచ్చని రైతులు తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం సాగు నీటికోసం రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని పలు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
రిజర్వాయర్ల ఏర్పాటు చేయకపోతే సాగుకష్టమే
జిల్లాలో రెండు ప్రధాన నదులున్నాయి. తుంగబద్ర, కృష్ణ నదుల నుండి నీరు వృద్ధాగా సముద్రం పాలువుతుంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరివాహక ప్రాంతంలో రిజర్వా యర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. రిజర్యా యర్లను పూర్తి చేస్తే... సాగు నీరుకు సమస్య ఉండదు. చెరువులు, కుంటలను మరమ్మతులు చేసి కాల్వల ద్వారా నీటిని నింపాలి.
- బాల్రెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి వనపర్తి