Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఉట్కూర్
సెప్టెంబర్ 17వ తేదీ ముమ్మాటికీ విద్రోహ దినమేనని సీపీఐఎంఎల్ ప్రజాపంథా నారాయణ పేట డివిజన్ కార్యదర్శి ఏ.సలీం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కిరణ్. పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ అన్నారు . గురువారం మండల కేంద్రంలోని ఉర్దూ భవనంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశానికి హాజరైన వారు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు చరిత్రను వక్రీకరిస్తూ విమోచన, జాతీయ సమైక్యత, విలీన దినం అంటున్నాయన్నారు. పటే ల్, పట్వారి, నిజాం దోపిడీ, ఆగడాలు, దౌర్జన్యాలను అడ్డుకోడానికి కమ్యూనిస్టుల నాయకత్వంలో సా యుధ పోరాటం చేశారన్నారు. తెలంగాణ సాయు ధ రైతాంగ పోరాటంలో కుల,మతం తేడా లేకుండా లక్షలాదిమంది దున్నేవాడికి భూమి కావాలని తమ భూములు తమకే కావాలని పెట్టి చాకిరి వ్యతిరేకం గా గిరిల్ల సాయిధ పోరాటాన్ని ఐక్యంగా కొనసాగిం చారన్నారు. ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ, హోం మంత్రి సర్దార్ వల్లభారు పటేల్ దేశంలో భూ సంస్కారణలు, సోషలిజాన్ని మేమే తీసుకొస్తామని హామీలతో తెలంగాణ సాయుధ పోరాటాన్ని అణిచి వేశాన్నారు. షేక్ బందగి షోయబుల్లాఖాన్ నిజాం కు వ్యతిరేకంగా పోరాటంలో ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. నేడు ప్రధాని మోదీ, హోంమినిస్టర్ అమిత్షా మతోన్మాదంతో, విభజించు పాలించు విధానాలతో ప్రజల మధ్య రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. ఈ17న జిల్లా ప్రజలు విద్రో హ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజాపంథా డివిజన్ నాయకులు వెంకట్ రెడ్డి, చెన్నప్ప, మండల నాయకులు సిద్దు, రాజు, కనక రాయుడు, ఐఎఫ్టియు నాయకులు యూసుఫ్ , బాలకృష్ణ గౌడ్, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.