Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
సెప్టెంబర్ 17న తెలంగాణ స్వతంత్ర దినోత్స వాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్య క్షులు డాక్టర్ మల్లు రవి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేక రుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో 1942 నుండి 1948 వరకు జరిగిన పోరాటాల చరిత్రను నేటి తరం ప్రజలకు వాస్తవాలు వివరిం చాల్సిన అధికార పార్టీలు వారి స్వార్ధ రాజకీయా లకు కోసం చరిత్రను వక్రీకరించే దిశకు దిగజారి పోయాయని విమర్శించారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణ రాష్ట్రం నిజాం నవాబు రాజు పాల నలో ఉన్న విషయం ఈ పాలకులకు తెలి యదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలో హిందువులు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటం చేయలేదని నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అందులో తెలంగాణ సాయుధ రైతంగా పోరాటానికి కమ్యూనిస్టులు నాయకత్వం వహిం చారని తెలిపారు. దేశంలో 370 చిన్న రాజ్యాలు భారతదేశంలో కలిసి స్వాతంత్రం తెచ్చుకున్న తెలంగాణ స్టేట్ అప్పటికి స్వతంత్రంగానే ఉందని తెలిపారు. తెలంగాణలో సాయుధ రైతంగ పోరా టం అనిచివేసే ఉద్దేశంతో నెహ్రూ, సర్దార్ వల్లభా రు పటేల్ పోలీస్ చర్య చేపట్టారని వారు తెలిపారు అప్పుడు నిజాం నవాబు తెలంగాణ స్టేట్‌ను భారత దేశంలో విలీనం చేసి వెళ్లిపోయారని గుర్తు చేశారు. చరిత్రకే వంక నామాలు పెడుతూ రాజకీయ లబ్ది పొందే ఈ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణలో సమైక్యత వజ్రోత్సవాలు కా దు విమోచన వేడుకలు కాదు తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్వాల్, మహిళా విభాగం అధ్యక్షు రాలు బెక్కరి అనిత, నాయకులు సీజే బెనహర్, లక్ష్మణ్ యాదవ్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.