Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పి. ఉదరుకుమార్
నవతెలంగాణ- బల్మూరు/అచ్చంపేట
చెంచు పెంటల్లో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటు చెంచుల జీవనోపాధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి. ఉదరు కుమార్ అన్నారు. మంగళవారం లింగాల మండలంలోని ఎర్రపెంట, బల్మూరు మండలం కొండనాగుల గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వా రా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఎర్ర పెంటలో చెంచుల జీనోమ్ జన్యు పరిశోధనకై కేంద్ర సంస్థ సి.సి.యం.బి ( సెం టర్ ఫర్ సెల్యులార్ అండ్ మాల్క్యులర్ బయాలజీ) సేకరిస్తున్న రక్త నమూనా కేంద్రాన్ని సైతం పరిశీ లించారు. ఇక్కడి ప్రజల్లో ఎవరికైనా ఏమైనా జబ్బు లు ఉన్నా, రక్తహీనత ఉన్న గుర్తించి నివేదిక ఇవ్వా లని సిసిఎంబి సిబ్బందిని ఆదేశించారు. చెంచులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ నీరు రోజు తప్పించి రోజు వస్తున్నా యని ప్రతి రోజు వచ్చేవిధంగా చూడాలని చెంచులు కలెక్టర్‌ను కోరారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆర్డీటీ ద్వారా చెంచులకు మంజూరు చేసిన 37 పక్కా ఇళ్ల నిర్మాణాలను పరిశీ లించారు. ఒక్కో ఇంటికి రూ. 3 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని, అవకాశం ఉంటే దగ్గర్లోని వాగు నుండి ఇసుక తీసుకోవటానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. చెంచు పెంటల్లో విరాసత్ దస్త్రాలు పెండింగ్ లో ఎన్ని ఉన్నాయా అని తహసిల్దార్‌ను ప్రశ్నించారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ ద్వారా పట్టాలు పొందిన రైతులకు రైతు బంధు అందరికి పడుతున్నాయ లేదా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ద్వారా చేయాల్సినవి అన్ని సదుపాయాలు చేస్తుందని, గ్రామ పంచాయతీ సైతం నిధులు సమకూర్చుకొని మరింతగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గర్భిణీల కు వైద్య చికిత్స కై 102 అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చే విధంగా చూడాలని, ఆర్.డి.టి ఉన్న ప్రాంతాల్లో ఆశ వర్కర్ తో పాటు కమ్యూనిటీ హెల్త్ వర్కర్ ఫోన్ చేసిన 102 వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. శ్రీరంగాపూర్ గ్రామస్థులు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని అటవీ శాఖాధికారులు కొత్తగా ఇళ్లు నిర్మించుకోడానికి అనుమతించడం లేదని కలెక్టర్‌ను కొరగా కమ్యూనిటీ రైట్స్ కింద దరఖాస్తు చేయించాలని పంచాయతి సెక్రటరీ ని ఆదేశించారు.
అనంతరం కొండనాగుల గ్రామంలో చెంచు మహిళల స్వయం ఉపాధి కోసం ఆర్టీటీ ద్వారా ఏర్పాటు చేసినకుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని పరిశీలించారు. 4 కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్కో సెంటర్లో 25 మంది చెంచు మహిళలకు శిక్షణ ఇచ్చి మిషన్లు సైతం వారికే ఇవ్వ నున్నట్లు రీజినల్ జాయింట్ డైరెక్టర్ పుష్ప కలెక్టర్ కు వివరించారు. అక్కడ శిక్షణ కై విచ్చేసిన మహిళలతో కలెక్టర్ మాట్లాడుతూ బాగా నేర్చుకొని పెంటల్లో జీవనోపాధి పొందాలని సూచించారు.
కలెక్టర్ వెంట ఆర్టీటీ ప్రాంతీయ సంచాలకులు పుష్ప, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అనిల్ ప్రకా ష్, లింగాల తహసిల్దార్, స్థానిక సర్పంచు, సిసి ఎంబి సాంకేతిక అధికారి జగ్మోహన్, ప్రాజెక్టు అసోసియేట్ నెహాసింగ్ తదితరులు ఉన్నారు.
సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకొవాలి
ఆర్థికంగా వెనుకబడిన చెంచుల జీవనోపాధికి ఐటిడిఏ, ఆర్డీటీ ద్వారా వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక ఎదగాలని కలెక్టర్ చెంచులకు సూచించారు. మన్ననూర్ గిరిజన భవనంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ జిల్లాలోని 52 గ్రామాల చెం చు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష విలువ చేసే ఉపాధి యూనిట్లను 500 కుటుం బాలకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. చెంచులు వారి ఇష్టప్రకారం దరఖాస్తు చేసుకున్న వారికి ఐటిడిఏ తరపున 250 యూనిట్లు, ఆర్డీటీి తరపున 250 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన రుణాలు నెరుగా యూనిట్ల కొనుగోలు కే అందజేయడం జరుగుతుందని ఎవరి కి తమ వ్యక్తిగత ఖాతాలో జమ చేయబడవన్నారు. మేలు రకం పాడి పశువులు ఎక్కడ దొరుకుతుందో అక్కడి నుండి పశు సంవర్థక శాఖ ద్వారా కొనుగోలు చేయించి ఇవ్వడంతో పాటు పశు పోషణపై తగిన శిక్షణ, మెళకువలు అందించడం జరుగుతుంద న్నారు. చెంచులు ఈ యూనిట్లను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధి సాధించాలని, వృధా చేసుకోవద్దని సూచించారు. కొంత మంది వ్యవసా య అనుబంధ యంత్రాలు, సౌండ్ సిస్టం, ఆటోలు, ఇటుక బట్టీల వ్యాపారం , హౌటల్ , తదితర యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారని, వీటన్నింటినీ త్వరలో మంత్రి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆర్డీటీ ప్రాంతీయ సంచాల కులు పుష్ప మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జీవించడానికి ఆర్థిక అవసరాలు ఉంటాయని వాటిని పొందటానికి స్వయం ఉపాధి ఎంతో అవసరమన్నారు. స్వయం ఉపాధి కై ఇస్తున్న యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ మాట్లాడుతూ కొంత మంది చెంచు లకు గైడ్‌గా ఉపాధి కల్పించడం జరుగుతుం దన్నారు. అయితే ఇతరుల పై ఆధార పడకుండా స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధిస్తే జీవన శైలిలో మార్పు వస్తుందని ఆలోచనా విధానం మారుతుందన్నారు. స్వయం ఉపాధి విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ వంతుగా సహ కారం అందిస్తామని తెలియజేసారు. ఈ కార్యక్ర మంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అనిల్ ప్రకా ష్, డీఆర్డీవో పీడీ నర్సింగ్ రావు, పశు సంవర్ధక అధి కారి డా. రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషో ర్, వివిధ పెంటల నుండి వచ్చిన చెంచు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.