Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ధరూర్
గద్వాల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలు సమన్వయంతో పని చేస్తే పోషకాహార లోపం, రక్తహీనతను జయించడమే కాకుండా బాల కార్మికులు, బాల్యవివాహాలు వంటి సామాజిక రుగ్మతల పైన సంపూర్ణ విజయం సాధిస్తామని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని కేఎస్ ఫంక్షన్ హాల్ లో మహిళా, శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళలు , పిల్లల పోషకాహార లోపం రక్తహీనత, బాల కార్మికులు, బాల్య వివాహాల పై అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, అడిషనల్ కలెక్టర్ శ్రీ హర్ష లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వైద్యం, ఆరోగ్యం రంగంలో మూడో స్థానంలో ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యం, ఆరోగ్య రంగాల్లో ఎంతో పురోగతి సాధించామని పేర్కొన్నారు. మొదటి స్థానంలో నిలవాలంటే అందరి సహకారం అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఈ ప్రాంతంలో 87 శాతం ఉన్న రక్తహీనత ఈ రెండేళ్లలో 42 శాతానికి తగ్గిందని, ఈ నెలలో 37 శాతానికి తగ్గడం అభినందనీ యమన్నారు. అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు ఇదేవిధంగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆకాంక్షించారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని రక్తహీనత, పోషకాహారం లోపం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కమిటీల ద్వారా ప్రతి నెల రెండో మంగళవారం సమావేశాలు నిర్వహించి పరిశుభ్రతతో పాటు మహిళలు, చిన్నారులు నెలకొన్న పోషకాహార లోపం, రక్తహీనత, బాల కార్మికులు, బాలవివాహాలపై చర్చించాలని అధికారులకు ఆదేశించారు. . అనంతరం ఆయన రంగాల్లో పనిచేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, సిబ్బందికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల శాలువా, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు. అనంతరం బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని మహా బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ అదేవిధంగా బతుకమ్మ సంబరాల లో ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులు పాటు అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లు, తో కలిసి బతుకమ్మను ఆడారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బాబర్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్, ఎంపీపీ విజరు, మనోరమ్మ జెడ్పీటీసీలు రాజశేఖర్, పద్మ వెంకటేశ్వర్ రెడ్డి, బాసు శ్యామల, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, కౌన్సిలర్స్ గిరిజి, నాగిరెడ్డి దౌలు , వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.