Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధరూర్
జిల్లాకేంద్రంలోని అక్షయ ఫంక్షన్హాల్లో మంగళవారం వర్తక-వ్యాపార ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సభకు యువ వ్యాపారవేత్త కొత్తకాపు చక్ర దర్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతం త్య్రం రాకముందు ఈ దేశంలో వ్యాపారం అనేది లేదు కేవలం వస్తు మార్పిడి రూపేనా ఉండేదన్నారు. జనాభా పెరగడం, అవసరాలు పెరగడంతో అన్నిరం గాల్లో వ్యా పారం చేయడం మొదలుపెట్టారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కమ్మ, కాపు, రెడ్డి, వెలమ ఇలా అందరూ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. టెక్నాలజీ పెరగడంతో అన్నివస్తువులు అందరికీ అందుబాటులోకి వచ్చిందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ దేశంలో ఉత్తర భారతీయులు అందునా ముఖ్యంగా గుజ రాతీలు-మార్వాడీలు దేశవ్యాప్తంగా అన్నివ్యాపారాల్లో స్థిరపడ్డారన్నారు. ప్రత్యేక కరెన్సీ, రవాణా రైలు మార్గం, అధునాతన వైద్య, అత్యున్నత విద్యలయాలు కలిగి ఉన్నామని, తెలంగాణ ఈ దేశంలో విలీనమవడంతో పుష్కలమైన వనరులు కలిగి, వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న మన దక్కన్ పీఠభూమిపై ఆంధ్రుల కన్ను పడటంతో కొన్ని షరతుల తో ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడిందన్నారు. మనల్ని మన వనరులని ఆంద్రులు దోచుకోవడంతోనే తెలంగాణ ఉద్య మం రావడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అర ుుందన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణపై ఆంధ్రుల దోపిడి కొంత వర కు నిలువరించగలిగిన చాపకింద నీరులా విస్తరించిన ము ఖ్యంగా దక్షిణ తెలంగాణపై మార్వాడీల వ్యాపారులు పెరిగిందన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సమద్ధిగా నీరు లభించడం, పుష్కలంగా పంటలు పండడం అధిగాక అక్షరాస్యత లేకపో వడంతో కేవలం కష్టంపై ఆధారపడి జీవించడం, నిరక్షరాస్యత ఉండటంతో వీరి ప్రవేశం సులభమైందన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా వారు పాగా వేశారన్నా రు. నది పరవాక ప్రాంతాలపై దృష్టిపెడు తూ అభివృద్ధి నోచుకోని ఈ ప్రాంతా లను అభివృద్ధి చేస్తామని నాయకులను నమ్మ బలుకుతున్నారు. మోసాన్ని పసిగట్టి నాయకులు మేధావులు మౌనం వీడి బడుగు, చిన్నతరహ వ్యాపా రస్తులకు అండగా నిలవాలి కోరారు. సమావేశంలో కరాటే శ్రీహరి, సాయి శ్యాం రెడ్డి, సీసల్ పాష, విష్ణుచారి, శ్రీనివా సాచారి, వెంకటస్వామి, లక్ష్మిరెడ్డి, కృష్ణారెడ్డి, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.